(॥పల్లవి॥)
ఏమని దూరే మెందాఁకా నిను
కామితఫలములు గలిగెను మాకు
(॥॥)
పఱుకు లేమిటికిఁ బలుమారు
అలర నీరపములాయ నిఁక
కొలఁదిమీరి రదె గొల్లెతలు
మలసి వారలకు మగఁడవు నీవు
(॥॥)
తడవ నేమిటికి తతిగొనుచు
చిడుముడి నీసేఁత చెల్లెనిఁక
అడరిరి పెండ్లికి నచ్చరలు
యెడయక వారల నేలితివి
(॥॥)
వెంగము లేఁటికి వెక్కసమై
కంగుదేర మముఁ గలసితివి
యింగితమెఱిఁగిన యిల్లాండ్లము
చెంగటఁ గూడితి శ్రీ వేంకటేశ
(||pallavi||)
emani dūre mĕṁdām̐kā ninu
kāmidaphalamulu galigĕnu māgu
(||||)
paṟugu lemiḍigim̐ balumāru
alara nīrabamulāya nim̐ka
kŏlam̐dimīri radĕ gŏllĕdalu
malasi vāralagu magam̐ḍavu nīvu
(||||)
taḍava nemiḍigi tadigŏnusu
siḍumuḍi nīsem̐ta sĕllĕnim̐ka
aḍariri pĕṁḍligi nachcharalu
yĕḍayaga vārala nelidivi
(||||)
vĕṁgamu lem̐ṭigi vĕkkasamai
kaṁgudera mamum̐ galasidivi
yiṁgidamĕṟim̐gina yillāṁḍlamu
sĕṁgaḍam̐ gūḍidi śhrī veṁkaḍeśha