ఏమనేవే యీతగవు లిందరూ నెఱఁగరా
(॥పల్లవి॥)
ఏమనేవే యీతగవు లిందరూ నెఱఁగరా
కోమలపు మగవాఁడు కొలఁదు లెఱుఁగునా
(॥ఏమ॥)
వరుసలంతా సరే వలపే యెక్కుడు గాని
గరిమెల నీవేల కాఁతాళించేవే
పురుషుఁడు నాతఁడే భోగించే వారి భాగ్యము
మరిగించి కలిసితే మఱి చలివాయదా
(॥ఏమ॥)
సవతులంతా సరే చనవే యెక్కుడు గాని
వివరించుకొనకేలే వేగిరింపులు
కవగూడి(డే?) వాఁడొకఁడే కలసే వారి నేరుపు
చివురు బలిసితేనే చేఁగలై నిలువవా
(॥ఏమ॥)
కళలూనంతా సరే కరఁగేదెక్కుడు గాని
పలుమారు నీవేల పంతమాడేవే
అలమె శ్రీ వేంకటేశుఁడంటిన మావొడఁబాటు
తొలుత మీనవ్వులెల్లా దొతులకునెక్కవా
(||pallavi||)
emaneve yīdagavu liṁdarū nĕṟam̐garā
komalabu magavām̐ḍu kŏlam̐du lĕṟum̐gunā
(||ema||)
varusalaṁtā sare valabe yĕkkuḍu gāni
garimĕla nīvela kām̐tāḽiṁcheve
puruṣhum̐ḍu nādam̐ḍe bhogiṁche vāri bhāgyamu
marigiṁchi kaliside maṟi salivāyadā
(||ema||)
savadulaṁtā sare sanave yĕkkuḍu gāni
vivariṁchugŏnagele vegiriṁpulu
kavagūḍi(ḍe?) vām̐ḍŏgam̐ḍe kalase vāri nerubu
sivuru balisidene sem̐galai niluvavā
(||ema||)
kaḽalūnaṁtā sare karam̐gedĕkkuḍu gāni
palumāru nīvela paṁtamāḍeve
alamĕ śhrī veṁkaḍeśhum̐ḍaṁṭina māvŏḍam̐bāḍu
tŏluda mīnavvulĕllā dŏdulagunĕkkavā