ఏమనేము నిన్నును యెరఁగవా నీవు
(॥పల్లవి॥)
ఏమనేము నిన్నును యెరఁగవా నీవు
నేమాన వలపించేవి నీ మాయలే కావా
(॥ఏమ॥)
మొగము చూడఁగానే మొలనూలు వట్టేవు
వెగటు లేనిది నీవేడుకే కాదా
సగము మాటాడఁగానే సారె నెగ్గులు వట్టేవు
నగవు రప్పించేది నీనాయమే కాదా
(॥ఏమ॥)
ప్రియములు చెప్పఁగానే పెదవులఁ దిట్టేవు
నయగారాలిచ్చీ నీసన్నలే కావా
క్రియ నీకుఁ జెప్పఁగానే కేలు చాఁచి పెనఁగేవు
దయదలపించేది నీ తగులే కాదా
(॥ఏమ॥)
సేవలు సేయఁగానే సిగ్గులు రప్పించేవు
వావులు దెలిపేది నీవలుపే కాదా
యీవల శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
మోవితేనె లూరించేవి ముచ్చటలే కావా
(||pallavi||)
emanemu ninnunu yĕram̐gavā nīvu
nemāna valabiṁchevi nī māyale kāvā
(||ema||)
mŏgamu sūḍam̐gāne mŏlanūlu vaṭṭevu
vĕgaḍu lenidi nīveḍuge kādā
sagamu māḍāḍam̐gāne sārĕ nĕggulu vaṭṭevu
nagavu rappiṁchedi nīnāyame kādā
(||ema||)
priyamulu sĕppam̐gāne pĕdavulam̐ diṭṭevu
nayagārālichchī nīsannale kāvā
kriya nīgum̐ jĕppam̐gāne kelu sām̐si pĕnam̐gevu
dayadalabiṁchedi nī tagule kādā
(||ema||)
sevalu seyam̐gāne siggulu rappiṁchevu
vāvulu dĕlibedi nīvalube kādā
yīvala śhrī veṁkaḍeśha yinniḍā nannelidivi
movidenĕ lūriṁchevi muchchaḍale kāvā