Emanemu ninnimka yemta sesinaa

ఏమనేము నిన్నిఁక యెంత సేసినా
Language

(॥పల్లవి॥)
ఏమనేము నిన్నిఁక యెంత సేసినా
నేమపువారము నేము నీచిత్తము కొలఁది

(॥ఏమ॥)
మగిడి మగిడి నీతో మాఁటలాడఁగాను నీకు
మొగచాటాయనేమో మోహము నాపై
యెగసక్కేలకు నాతో యెక్కడో వారి సుద్దులు
నిగిడి యానతిచ్చేవు నీచిత్తము కొలఁది

(॥ఏమ॥)
చనవు సేసుక యిట్టె సరసమాడఁగ నీకు
తనిసితి వేమో నాతో తమకముల
పనిమాలిన పనికి పరులసొమ్ములు దెచ్చి
నినువుగా నాకిచ్చేవు నీచిత్తము కొలఁది

(॥ఏమ॥)
యెరవు లేక నేను యిచ్చకాలాడఁగ నీకు
తరితీపు వుట్టెనేమో తతిరతికి
యిరవై శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
నెరులాపెఁ బోలిచేవు నీచిత్తము కొలఁది

(||pallavi||)
emanemu ninnim̐ka yĕṁta sesinā
nemabuvāramu nemu nīsittamu kŏlam̐di

(||ema||)
magiḍi magiḍi nīdo mām̐ṭalāḍam̐gānu nīgu
mŏgasāḍāyanemo mohamu nābai
yĕgasakkelagu nādo yĕkkaḍo vāri suddulu
nigiḍi yānadichchevu nīsittamu kŏlam̐di

(||ema||)
sanavu sesuga yiṭṭĕ sarasamāḍam̐ga nīgu
tanisidi vemo nādo tamagamula
panimālina panigi parulasŏmmulu dĕchchi
ninuvugā nāgichchevu nīsittamu kŏlam̐di

(||ema||)
yĕravu lega nenu yichchagālāḍam̐ga nīgu
taridību vuṭṭĕnemo tadiradigi
yiravai śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
nĕrulābĕm̐ bolisevu nīsittamu kŏlam̐di