Emanemayyaa neevu yeṟamgani pani ledu

ఏమనేమయ్యా నీవు యెఱఁగని పని లేదు
Language

(॥పల్లవి॥)
ఏమనేమయ్యా నీవు యెఱఁగని పని లేదు
కోమలి కొప్పంటేవు కొంకక నాయెదుట

(॥ఏమ॥)
యెఱఁగమి సేసుకొని యెంతవున్నా నెఱఁగవు
వెఱవక మాటాడేవు వెలఁదితోను
వొఱిమ గలదాననై వోరిచినా నెఱఁగవు
మఱి సరసమాడేవు మలసి నాయెదుట

(॥ఏమ॥)
అనఁజాలక కోపమణఁచినా నెఱఁగవు
పెనఁగేవాపెచన్నుల బెడిదముగా
వెనక మొకమాటాన వేఁడుకొన్నా నెఱఁగవు
చెనకేవు కొనగోరఁ జెలితో నాయెదుట

(॥ఏమ॥)
ప్రియపడి కాఁగిట బిగించినా నెఱఁగవు
క్రియతోడ నాపెదిక్కే చూచేవు
నియతి శ్రీవేంకటేశ నేనలమేలుమంగను
దయఁ గూడితి వాపెకు దక్కేవునాయెదుట

(||pallavi||)
emanemayyā nīvu yĕṟam̐gani pani ledu
komali kŏppaṁṭevu kŏṁkaga nāyĕduḍa

(||ema||)
yĕṟam̐gami sesugŏni yĕṁtavunnā nĕṟam̐gavu
vĕṟavaga māḍāḍevu vĕlam̐didonu
vŏṟima galadānanai vorisinā nĕṟam̐gavu
maṟi sarasamāḍevu malasi nāyĕduḍa

(||ema||)
anam̐jālaga kobamaṇam̐sinā nĕṟam̐gavu
pĕnam̐gevābĕsannula bĕḍidamugā
vĕnaga mŏgamāḍāna vem̐ḍugŏnnā nĕṟam̐gavu
sĕnagevu kŏnagoram̐ jĕlido nāyĕduḍa

(||ema||)
priyabaḍi kām̐giḍa bigiṁchinā nĕṟam̐gavu
kriyadoḍa nābĕdikke sūsevu
niyadi śhrīveṁkaḍeśha nenalamelumaṁganu
dayam̐ gūḍidi vābĕgu dakkevunāyĕduḍa