ఏమనేమయ్యా నీవే ఇంత సేయఁగా
(॥పల్లవి॥)
ఏమనేమయ్యా నీవే ఇంత సేయఁగా
చే ముట్టి చెనకితేను చిత్తము గరఁగేవు
(॥ఏమనే॥)
మొగము చూచితేను మొక్కేవు నీతో
నగితే నన్ను నిట్టే నమ్మితిననేవు
యెగసక్కేలాడినాను యియ్యకొనేవు
తగవు గాదంటేను తగుల నాడేవు
(॥ఏమనే॥)
మాటలాడితేనే మరిగేవుఁనీ
చోట నిలిచితేనే సొలయ వచ్చేవు
పాటలు వాడితే బళి యనేవు నిన్ను
నాటుకొనఁ జూచితేను నయము చూపేవు
(॥ఏమనే॥)
దగ్గరఁ గూచుండితే తమకించేవుఁ నే
సిగ్గులు వడినంతనే చేయి చాఁచేవు
కగ్గక శ్రీవేకంటేశ కలసితివి
వొగ్గి విడెమియ్య రాఁగా వొడి వట్టేవు
(||pallavi||)
emanemayyā nīve iṁta seyam̐gā
se muṭṭi sĕnagidenu sittamu garam̐gevu
(||emane||)
mŏgamu sūsidenu mŏkkevu nīdo
nagide nannu niṭṭe nammidinanevu
yĕgasakkelāḍinānu yiyyagŏnevu
tagavu gādaṁṭenu tagula nāḍevu
(||emane||)
māḍalāḍidene marigevum̐nī
soḍa nilisidene sŏlaya vachchevu
pāḍalu vāḍide baḽi yanevu ninnu
nāḍugŏnam̐ jūsidenu nayamu sūbevu
(||emane||)
daggaram̐ gūsuṁḍide tamagiṁchevum̐ ne
siggulu vaḍinaṁtane seyi sām̐sevu
kaggaga śhrīvegaṁṭeśha kalasidivi
vŏggi viḍĕmiyya rām̐gā vŏḍi vaṭṭevu