Emaneene ramanumdu yimtido nemdu

ఏమనీనే రమణుఁడు యింతితో నేఁడు
Language

(॥పల్లవి॥)
ఏమనీనే రమణుఁడు యింతితో నేఁడు
నేమము దప్పకుండితే నిజమౌఁ గాకా

(॥ఏమనీనే॥)
మతకారివలపులు మనసునఁ బట్టునా
తతితో నాస గలిసితే తగుతాఁ గాక
రతికెక్కనిమాటలు రసము లొలుకునా
సతముగా నాడితేను చవులేఁ గాకా

(॥ఏమనీనే॥)
పుక్కిటిలేఁత నవ్వులు పొందులకు వచ్చునా
అక్కర గలిగితే వేడుకై యుండుఁ గాకా
లక్కకపురు ప్రియాలు లాలనకు వచ్చునా
వొక్కజాడనే వుండితే వొద్దికలౌఁ గాకా

(॥ఏమనీనే॥)
వేసాల ఆన లెల్లా వెస నమ్మిక లౌనా
బాసలు దప్పకుండితే బలిమౌఁ గాకా
సేసవెట్టి ననుఁ గూడే శ్రీవేంకటేశుఁ డిట్టె
యీసరినే వుండితేను యెన్నిక లౌఁగాకా

(||pallavi||)
emanīne ramaṇum̐ḍu yiṁtido nem̐ḍu
nemamu dappaguṁḍide nijamaum̐ gāgā

(||emanīne||)
madagārivalabulu manasunam̐ baṭṭunā
tadido nāsa galiside tagudām̐ gāga
radigĕkkanimāḍalu rasamu lŏlugunā
sadamugā nāḍidenu savulem̐ gāgā

(||emanīne||)
pukkiḍilem̐ta navvulu pŏṁdulagu vachchunā
akkara galigide veḍugai yuṁḍum̐ gāgā
lakkagaburu priyālu lālanagu vachchunā
vŏkkajāḍane vuṁḍide vŏddigalaum̐ gāgā

(||emanīne||)
vesāla āna lĕllā vĕsa nammiga launā
bāsalu dappaguṁḍide balimaum̐ gāgā
sesavĕṭṭi nanum̐ gūḍe śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ
yīsarine vuṁḍidenu yĕnniga laum̐gāgā