Emaneene ramanumdu imkaa nannu

ఏమనీనే రమణుఁడు ఇంకా నన్ను
Language

(॥పల్లవి॥)
ఏమనీనే రమణుఁడు ఇంకా నన్ను
కామించి నేరిచినాఁడు కతకారాలు

(॥॥)
తగవులఁ బెట్టీనవే తన్ను నదె చూడవే
చిగురుఁబెదవిమీఁదిసింగారాలు
అగడు నేఁ జేసితినా అందరు నాడుకొనేరు
నగవుఁజూపులలోని నయగారాలు

(॥॥)
యెదుటనే వున్నవనే యెన్నికగాఁ జూడవే
వుదుటుఁజెక్కులమీఁది వొయ్యారాలు
వెదకితేఁ దనమేలు వెల్లావిరులాయ నేఁడు
పదిమారులునేఁటికే బయకారాలు

(॥॥)
చెంగటనే నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁ జూడవే
అంగడిఁ బెట్టీ పులకలంభారాలు
యెంగిలిపుక్కిటివిడే లిప్పుడే కానఁగవచ్చె
పంగెనరతులలోనిపచారాలు

(||pallavi||)
emanīne ramaṇum̐ḍu iṁkā nannu
kāmiṁchi nerisinām̐ḍu kadagārālu

(||||)
tagavulam̐ bĕṭṭīnave tannu nadĕ sūḍave
sigurum̐bĕdavimīm̐disiṁgārālu
agaḍu nem̐ jesidinā aṁdaru nāḍugŏneru
nagavum̐jūbulaloni nayagārālu

(||||)
yĕduḍane vunnavane yĕnnigagām̐ jūḍave
vuduḍum̐jĕkkulamīm̐di vŏyyārālu
vĕdagidem̐ danamelu vĕllāvirulāya nem̐ḍu
padimārulunem̐ṭige bayagārālu

(||||)
sĕṁgaḍane nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ jūḍave
aṁgaḍim̐ bĕṭṭī pulagalaṁbhārālu
yĕṁgilibukkiḍiviḍe lippuḍe kānam̐gavachchĕ
paṁgĕnaradulalonibasārālu