ఏమననేవోయని నాకు యెంచరాదు తమకము
(॥పల్లవి॥)
ఏమననేవోయని నాకు యెంచరాదు తమకము
నామనసు దా నెఱుఁగు నాలిసేయఁడు గదా
(॥ఏమ॥)
చెప్పితినా ఆతనితోఁ జెలియ నామాటలెల్లా
దప్పిగొన్న ట్టిచ్చగించి తాను వినెనా
అప్పటి నేమని విభుఁ డానతిచ్చె మారుమాట
తప్పఁడు గదా నాడుఁ దా నిచ్చినబాస
(॥ఏమ॥)
పిలిచితివా నీవు ప్రియము గూరిచి వాని
వలపు గలిగి తా వచ్చేననెనా
తలఁపు నీకుఁ దెలుసు తడవెనా నాసుద్ది
సెలవినవ్వులతో నీచేతికాను కంటేనా
(॥ఏమ॥)
యిచ్చితివా ఆనవాలు యింతి నారమణునికి
యిచ్చల శ్రీవేంకటేశుఁ డియ్యకొనెనా
వచ్చె నిదె యింతలోనే వహి కెక్క ననుఁ గూడె
తచ్చన లింతాఁ జేసె తారుకాణ లాయనా
(||pallavi||)
emananevoyani nāgu yĕṁcharādu tamagamu
nāmanasu dā nĕṟum̐gu nāliseyam̐ḍu gadā
(||ema||)
sĕppidinā ādanidom̐ jĕliya nāmāḍalĕllā
dappigŏnna ṭṭichchagiṁchi tānu vinĕnā
appaḍi nemani vibhum̐ ḍānadichchĕ mārumāḍa
tappam̐ḍu gadā nāḍum̐ dā nichchinabāsa
(||ema||)
pilisidivā nīvu priyamu gūrisi vāni
valabu galigi tā vachchenanĕnā
talam̐pu nīgum̐ dĕlusu taḍavĕnā nāsuddi
sĕlavinavvulado nīsedigānu kaṁṭenā
(||ema||)
yichchidivā ānavālu yiṁti nāramaṇunigi
yichchala śhrīveṁkaḍeśhum̐ ḍiyyagŏnĕnā
vachchĕ nidĕ yiṁtalone vahi kĕkka nanum̐ gūḍĕ
tachchana liṁtām̐ jesĕ tārugāṇa lāyanā