Emanamgavachchu ninnu niduvamtivaanini

ఏమనఁగవచ్చు నిన్ను నిటువంటివానిని
Language

(॥పల్లవి॥)
ఏమనఁగవచ్చు నిన్ను నిటువంటివానిని
చే ముట్టి చెనకుతానే సిగ్గులు వడేవు

(॥ఏమ॥)
సేసవెట్టుకున్నాపె చెంగటనే వుండఁగానే
బాస చేసేవు నాకే పతినంటాను
ఆసతో నింటికివచ్చినాపె మోముచూడఁగాను
పోసరించి నీనిజము పొగడుకొనేవు

(॥ఏమ॥)
వుంకువ గొనినయాకె వూడిగాలు సేయఁగాను
లంకెఁ గాఁగలించేవు వలతునంటాను
అంకె నీచేత నుంగరమందుకొన్నాపె నవ్వఁగ
బొంకుచు నీ యాచారము పొగడుకొనేవు

(॥ఏమ॥)
వోరచి వచ్చినయాపె పొత్తులఁ గుడువఁగాను
వారించి మోవిచ్చేవు నావాఁడనంటాను
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
బోరన నీగుణములు పొగడుకొనేవు

(||pallavi||)
emanam̐gavachchu ninnu niḍuvaṁṭivānini
se muṭṭi sĕnagudāne siggulu vaḍevu

(||ema||)
sesavĕṭṭugunnābĕ sĕṁgaḍane vuṁḍam̐gāne
bāsa sesevu nāge padinaṁṭānu
āsado niṁṭigivachchinābĕ momusūḍam̐gānu
posariṁchi nīnijamu pŏgaḍugŏnevu

(||ema||)
vuṁkuva gŏninayāgĕ vūḍigālu seyam̐gānu
laṁkĕm̐ gām̐galiṁchevu valadunaṁṭānu
aṁkĕ nīseda nuṁgaramaṁdugŏnnābĕ navvam̐ga
bŏṁkusu nī yāsāramu pŏgaḍugŏnevu

(||ema||)
vorasi vachchinayābĕ pŏttulam̐ guḍuvam̐gānu
vāriṁchi movichchevu nāvām̐ḍanaṁṭānu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
borana nīguṇamulu pŏgaḍugŏnevu