ఏమనఁగవచ్చు నిఁక నింతా నీమహిమలే
(॥పల్లవి॥)
ఏమనఁగవచ్చు నిఁక నింతా నీమహిమలే
ఆముకొన్న వలపు నీ కచ్చివచ్చెఁగా
(॥ఏమ॥)
అలరి యాకెకు నెంత ఆసవెట్టితివో నీవు
సెలవుల నవ్వుకొంటాఁ జెలరేఁగీని
నలువంక చనవెల్లా నాకె కలదని వుంటి
కలిగిఁగా నీపె నొకతె నీకు నిపుడు
(॥ఏమ॥)
మట్టుమీర మరీ నెంత మన్నించితివో నీవు
పట్టెమంచ మెక్కుకొని పాయకున్నది
తొట్టనగర్వము లాడ దొరనై నే నుందానను
నెట్టనఁ దానూఁ గొంత నేర్చెఁగా యీపనులు
(॥ఏమ॥)
అంది శ్రీవేంకటేశ్వర ఆకె నెట్టు గూడితివో
చిందుఁజెమటల చెలి సిగ్గువడీని
కందువ నిన్నుఁ బెండ్లాడి కైకొంటి సిరులెల్లా
విందువలె తా వచ్చెంగా వినోదముగాను
(||pallavi||)
emanam̐gavachchu nim̐ka niṁtā nīmahimale
āmugŏnna valabu nī kachchivachchĕm̐gā
(||ema||)
alari yāgĕgu nĕṁta āsavĕṭṭidivo nīvu
sĕlavula navvugŏṁṭām̐ jĕlarem̐gīni
naluvaṁka sanavĕllā nāgĕ kaladani vuṁṭi
kaligim̐gā nībĕ nŏgadĕ nīgu nibuḍu
(||ema||)
maṭṭumīra marī nĕṁta manniṁchidivo nīvu
paṭṭĕmaṁcha mĕkkugŏni pāyagunnadi
tŏṭṭanagarvamu lāḍa dŏranai ne nuṁdānanu
nĕṭṭanam̐ dānūm̐ gŏṁta nersĕm̐gā yībanulu
(||ema||)
aṁdi śhrīveṁkaḍeśhvara āgĕ nĕṭṭu gūḍidivo
siṁdum̐jĕmaḍala sĕli sigguvaḍīni
kaṁduva ninnum̐ bĕṁḍlāḍi kaigŏṁṭi sirulĕllā
viṁduvalĕ tā vachchĕṁgā vinodamugānu