Emanamga nemavuno yenniga letto

ఏమనఁగ నేమవునో యెన్నిక లెట్టో
Language

(॥పల్లవి॥)
ఏమనఁగ నేమవునో యెన్నిక లెట్టో
నా మనసులోననే నవ్వితిఁ బో నేను

(॥ఏమన॥)
ఆకెకుఁగా నొత్తి మాటలాడితే నీ చిత్త మెటో
కాక యేమీ ననకున్నఁ గాంత యెట్టో
యీకడ నాకడ నే నిద్దరి నే మన లేక
నాకు నాకే వెఱగై నవ్వితి బో నేను

(॥ఏమన॥)
నెమ్మది మీ యిద్దరిలో నిజ మాడఁగా నెటొ
వుమ్మడి నూరక నే నుండితే నెట్టొ
చిమ్ముల మీ యలుకలు చిమ్మిరేఁగిన వొట్లు
నమ్మ లేక నాలోనే నవ్వితిఁ బో నేను

(॥ఏమన॥)
తలపోసి మీలోని తమకము లవి యెట్టో
కొలఁది మీఱిన యింతికోరిక లెట్టో
చెలిఁ గూడితివి నేఁడు శ్రీవేంకటేశ్వర
నిలువున మిమ్ముఁ జూచి నవ్వితిఁ బో నేను

(||pallavi||)
emanam̐ga nemavuno yĕnniga lĕṭṭo
nā manasulonane navvidim̐ bo nenu

(||emana||)
āgĕgum̐gā nŏtti māḍalāḍide nī sitta mĕḍo
kāga yemī nanagunnam̐ gāṁta yĕṭṭo
yīgaḍa nāgaḍa ne niddari ne mana lega
nāgu nāge vĕṟagai navvidi bo nenu

(||emana||)
nĕmmadi mī yiddarilo nija māḍam̐gā nĕḍŏ
vummaḍi nūraga ne nuṁḍide nĕṭṭŏ
simmula mī yalugalu simmirem̐gina vŏṭlu
namma lega nālone navvidim̐ bo nenu

(||emana||)
talabosi mīloni tamagamu lavi yĕṭṭo
kŏlam̐di mīṟina yiṁtigoriga lĕṭṭo
sĕlim̐ gūḍidivi nem̐ḍu śhrīveṁkaḍeśhvara
niluvuna mimmum̐ jūsi navvidim̐ bo nenu