Emamtivo kaani yimtidoda neevu

ఏమంటివో కాని యింతితోడ నీవు
Language

(॥పల్లవి॥)
ఏమంటివో కాని యింతితోడ నీవు
నీ మాఁటలే నమ్మి నిక్కి చూచీని

(॥ఏమం॥)
చెక్కునఁబెట్టినచేతితోఁజెలియ
పెక్కువిచారాల బెరసీని
తక్కక నీమాఁట తలఁచి తలఁచి
చిక్కనిచెమట చిందీని

(॥ఏమం॥)
వుసురసుల నుమ్మగిలుకొంటా
కొసరి నీరాక గోరీని
యెసఁగ నీచేఁత లెంచి యెంచి లోలో
పొసఁగఁగ మైనిండఁ బులకించీని

(॥ఏమం॥)
శిరసుమీఁదటిసేసపాలతోడ
సురత భావాలఁజొక్కీని
సరి శ్రీవేంకటేశ యల మేల్మంగ
మరిగె నీపొందు మరిఁగోరీని

(||pallavi||)
emaṁṭivo kāni yiṁtidoḍa nīvu
nī mām̐ṭale nammi nikki sūsīni

(||emaṁ||)
sĕkkunam̐bĕṭṭinasedidom̐jĕliya
pĕkkuvisārāla bĕrasīni
takkaga nīmām̐ṭa talam̐si talam̐si
sikkanisĕmaḍa siṁdīni

(||emaṁ||)
vusurasula nummagilugŏṁṭā
kŏsari nīrāga gorīni
yĕsam̐ga nīsem̐ta lĕṁchi yĕṁchi lolo
pŏsam̐gam̐ga mainiṁḍam̐ bulagiṁchīni

(||emaṁ||)
śhirasumīm̐daḍisesabāladoḍa
surada bhāvālam̐jŏkkīni
sari śhrīveṁkaḍeśha yala melmaṁga
marigĕ nībŏṁdu marim̐gorīni