ఏమంటి వేమంటి వెఱఁగ నేను । వో
(॥పల్లవి॥)
ఏమంటి వేమంటి వెఱఁగ నేను । వో-
కామిని నీకిప్పుడైనఁ గానవచ్చెఁగా
(॥ఏమం॥)
వేలఁ దలుపుమీఁటినవిటుఁ డెవ్వఁడే వో
తాలిమి నేనే మాధవుఁడను
వాలినమాధవుఁడవంటె వసంతుఁడవా కాదే
గాలింపుచక్రము చేతఁగలవాఁడ నేనే
(॥ఏమం॥)
ధరఁ జక్రివైతేఁ గుమ్మరవాఁడవా కాదే
సిరుల భూమి ధరించినవాఁడనే
శిరసున భూమిమోఁచే శేషుఁడవా కాదే
అరయ నిన్నియునేలేహరినే నేను
(॥ఏమం॥)
వంతులకు హరివైతే వానరమవా నీ-
మంతనపు లక్ష్మీరమణుఁడ నేను
యింతయేల శ్రీవేంకటేశుఁడ ననఁగరాదా తొల్లి
అంతేపో నామారు నీవంటివిగదే
(||pallavi||)
emaṁṭi vemaṁṭi vĕṟam̐ga nenu | vo-
kāmini nīgippuḍainam̐ gānavachchĕm̐gā
(||emaṁ||)
velam̐ dalubumīm̐ṭinaviḍum̐ ḍĕvvam̐ḍe vo
tālimi nene mādhavum̐ḍanu
vālinamādhavum̐ḍavaṁṭĕ vasaṁtum̐ḍavā kāde
gāliṁpusakramu sedam̐galavām̐ḍa nene
(||emaṁ||)
dharam̐ jakrivaidem̐ gummaravām̐ḍavā kāde
sirula bhūmi dhariṁchinavām̐ḍane
śhirasuna bhūmimom̐se śheṣhum̐ḍavā kāde
araya ninniyuneleharine nenu
(||emaṁ||)
vaṁtulagu harivaide vānaramavā nī-
maṁtanabu lakṣhmīramaṇum̐ḍa nenu
yiṁtayela śhrīveṁkaḍeśhum̐ḍa nanam̐garādā tŏlli
aṁtebo nāmāru nīvaṁṭivigade