(॥పల్లవి॥)
ఏమంటే నేమంటి నింతేకదే
దామెన ప్రియాలు నేరఁ దనకేలే యలుక
(॥ఏమం॥)
నవ్వితే నవ్వుదును నామోము చూచితే-
నివ్వల నేనూఁ జూచే దింతేకదే
రవ్వతన మెఱఁగను రాజసాల కోపను
దవ్వులనుండి వచ్చి తనకేలే యలుక
(॥ఏమం॥)
పలికితేఁ బలికితి పైఁ జేయివేసితేను
యెలమి నేనూ వేసితి నింతేకదే
యెలయించనొల్లను యిచ్చకము నేరను
తలుపు మాటున నుండి తననేలే యలుక
(॥ఏమం॥)
కూడితేఁ నేఁ గూడితి కొసరితేఁ గొసరితి
యీడనే శ్రీవేంకటేశు నింతేకదే
పాడిపంతా లెఱఁగను వచ్చి సేయఁజాలను
తాడుపడి యిందాఁకాఁ దనకేలే యలుక
(||pallavi||)
emaṁṭe nemaṁṭi niṁtegade
dāmĕna priyālu neram̐ danagele yaluga
(||emaṁ||)
navvide navvudunu nāmomu sūside-
nivvala nenūm̐ jūse diṁtegade
ravvadana mĕṟam̐ganu rājasāla kobanu
davvulanuṁḍi vachchi tanagele yaluga
(||emaṁ||)
paligidem̐ baligidi paim̐ jeyivesidenu
yĕlami nenū vesidi niṁtegade
yĕlayiṁchanŏllanu yichchagamu neranu
talubu māḍuna nuṁḍi tananele yaluga
(||emaṁ||)
kūḍidem̐ nem̐ gūḍidi kŏsaridem̐ gŏsaridi
yīḍane śhrīveṁkaḍeśhu niṁtegade
pāḍibaṁtā lĕṟam̐ganu vachchi seyam̐jālanu
tāḍubaḍi yiṁdām̐kām̐ danagele yaluga