ఏమంటా నుండెనో యిట్టే వేగినంతా
(॥పల్లవి॥)
ఏమంటా నుండెనో యిట్టే వేగినంతా
ప్రేమాన నిప్పుడు ప్రియము చెప్పీని
(॥ఏమం॥)
పొంచి నా విభుఁడు పొద్దుననే వచ్చి
అంచెల వేఁడుకొనానవెట్టీ
మంచిదానవే మంతనాన నీతో
యెంచుకొన్న సుద్దు లెఱిఁగింతురా
(॥ఏమం॥)
యింతిరో నితఁడు యింటికిఁదా వచ్చి
పంతమిచ్చి నాకు బాససేసీని
యెంత సేసితివే యీడ విరహాన
చింతించినవి యల్లఁ జెప్పుదురా
(॥ఏమం॥)
శ్రీ వేంకటేశుఁడు చేర నన్ను వచ్చి
చేవమీరఁ గూడి చేపట్టెను
నీవే నేఁ గానటే నిన్నమాపటంత
వేవేలు నాడితే వేగిరింతురా
(||pallavi||)
emaṁṭā nuṁḍĕno yiṭṭe veginaṁtā
premāna nippuḍu priyamu sĕppīni
(||emaṁ||)
pŏṁchi nā vibhum̐ḍu pŏddunane vachchi
aṁchĕla vem̐ḍugŏnānavĕṭṭī
maṁchidānave maṁtanāna nīdo
yĕṁchugŏnna suddu lĕṟim̐giṁturā
(||emaṁ||)
yiṁtiro nidam̐ḍu yiṁṭigim̐dā vachchi
paṁtamichchi nāgu bāsasesīni
yĕṁta sesidive yīḍa virahāna
siṁtiṁchinavi yallam̐ jĕppudurā
(||emaṁ||)
śhrī veṁkaḍeśhum̐ḍu sera nannu vachchi
sevamīram̐ gūḍi sebaṭṭĕnu
nīve nem̐ gānaḍe ninnamābaḍaṁta
vevelu nāḍide vegiriṁturā