ఏమమ్మ యశోద యిదె నీబిడ్డఁడు
(॥పల్లవి॥)
ఏమమ్మ యశోద యిదె నీబిడ్డఁడు
గామిడితనాలఁ గదిసీ వీఁడే
(॥॥)
గొల్గలుఁ దానును గోపికలిండ్ల
కొల్లగా నుట్లు గొట్టి వీఁడే
పల్లదాన వారిపాలిండ్లమీఁదట
చిల్లరసేఁతలు చేసీ వీఁడే
(॥॥)
పాలువెన్నలును బానలతోడత
కేలు చాఁచి యారగించీ వీఁడే
మేలిమిసతుల మేనబావనంటా
కోలుముందుగాఁ గూడీ వీఁడే
(॥॥)
అట్టులుఁజక్కిలా లడుకులు వేలఁ-
గట్టినఁ గోలలఁ గొట్టీ వీఁడే
దిట్టయి శ్రీవేంకటాద్రి నలమేల్మంగఁ-
గట్టుక దేవుఁడై కడఁగీ వీఁడే
(||pallavi||)
emamma yaśhoda yidĕ nībiḍḍam̐ḍu
gāmiḍidanālam̐ gadisī vīm̐ḍe
(||||)
gŏlgalum̐ dānunu gobigaliṁḍla
kŏllagā nuṭlu gŏṭṭi vīm̐ḍe
palladāna vāribāliṁḍlamīm̐daḍa
sillarasem̐talu sesī vīm̐ḍe
(||||)
pāluvĕnnalunu bānaladoḍada
kelu sām̐si yāragiṁchī vīm̐ḍe
melimisadula menabāvanaṁṭā
kolumuṁdugām̐ gūḍī vīm̐ḍe
(||||)
aṭṭulum̐jakkilā laḍugulu velam̐-
gaṭṭinam̐ golalam̐ gŏṭṭī vīm̐ḍe
diṭṭayi śhrīveṁkaḍādri nalamelmaṁgam̐-
gaṭṭuga devum̐ḍai kaḍam̐gī vīm̐ḍe