ఏమమ్మ యశోద మీయింటికి నేము వచ్చితే
(॥పల్లవి॥)
ఏమమ్మ యశోద మీయింటికి నేము వచ్చితే
గామువంటి బిడ్డ నిచ్చి కలుపడఁ జేసితి
(॥॥)
పాలు గారీ సెలవులఁ బక్కునఁ జెక్కుమీఁటితే
వేలువెట్టితే లోకాలు వెల్లివిరిసీ
వీలి నేము వుగ్గువెట్ట వెరతుము మీవాఁడు
బాలుఁడా దయ్యముగాక పట్టవమ్మా
(॥॥)
నెమ్మిఁదొడమీఁద నుండి నిలువు నూరు వండీని
పమ్మి నాల్గుమోముల పాపఁడు లోన నున్నాఁడు
నెమ్మదిఁ బాలు వోయఁగ నే వెరతు మీవాఁడు
ఇమ్ముల వీఁడు మానిశా యెవ్వఁడో కాక
(॥॥)
పక్కన నీరార్చితిఁ బయ్యదలో నిడుకొంటి
మక్కువ నాకే తాను మగఁడైనాఁడు
చిక్కిన పను లింకేమీఁ జెప్పఁగ నేవెరతును
యెక్కువ శ్రీ వేంకటుశుఁడితఁడేపో యమ్మా
(||pallavi||)
emamma yaśhoda mīyiṁṭigi nemu vachchide
gāmuvaṁṭi biḍḍa nichchi kalubaḍam̐ jesidi
(||||)
pālu gārī sĕlavulam̐ bakkunam̐ jĕkkumīm̐ṭide
veluvĕṭṭide logālu vĕllivirisī
vīli nemu vugguvĕṭṭa vĕradumu mīvām̐ḍu
bālum̐ḍā dayyamugāga paṭṭavammā
(||||)
nĕmmim̐dŏḍamīm̐da nuṁḍi niluvu nūru vaṁḍīni
pammi nālgumomula pābam̐ḍu lona nunnām̐ḍu
nĕmmadim̐ bālu voyam̐ga ne vĕradu mīvām̐ḍu
immula vīm̐ḍu māniśhā yĕvvam̐ḍo kāga
(||||)
pakkana nīrārsidim̐ bayyadalo niḍugŏṁṭi
makkuva nāge tānu magam̐ḍainām̐ḍu
sikkina panu liṁkemīm̐ jĕppam̐ga nevĕradunu
yĕkkuva śhrī veṁkaḍuśhum̐ḍidam̐ḍebo yammā