(॥పల్లవి॥)
ఏమమ్మ వూరకుండే వెశోదమ్మా
యీ మేఁటిబాలకృష్ణు నేమరకువమ్మా
(॥ఏమ॥)
బండి దన్నెఁ బట్టరమ్మ బాలునిపాదము నొచ్చీ
కొండ యెత్తె నొకచేతఁ గోరి వీఁడు
యెండనె మాఁకులసంది కేఁగకుండాఁ బట్టరమ్మ
దండిబాలుఁ డేమెఱుఁగు దగ్గరుండరమ్మా
(॥ఏమ॥)
పాముఁ బట్టీఁ బట్టరమ్మ పసిబిడ్డఁడేమెఱుగు
దామెనకోడెలఁ గొట్టీఁ దానే వీఁడు
కామించి మాఁకులెక్కీఁ గాదని మానుపరమ్మ
బూమెల యీ బాలునికి బుద్ది చెప్పరమ్మా
(॥ఏమ॥)
గాలికేఁగీఁ బట్టరమ్మ కడుశిశు వేమెఱుగు
పాలువెన్నలు దొంగిలీ బాలుఁడు వీడు
ఆలిరయై శ్రీ వేంకటాచలము మీఁది కెక్కె
ఆలుఁదాను నున్నాఁ డదె చూడరమ్మా
(||pallavi||)
emamma vūraguṁḍe vĕśhodammā
yī mem̐ṭibālakṛṣhṇu nemaraguvammā
(||ema||)
baṁḍi dannĕm̐ baṭṭaramma bālunibādamu nŏchchī
kŏṁḍa yĕttĕ nŏgasedam̐ gori vīm̐ḍu
yĕṁḍanĕ mām̐kulasaṁdi kem̐gaguṁḍām̐ baṭṭaramma
daṁḍibālum̐ ḍemĕṟum̐gu daggaruṁḍarammā
(||ema||)
pāmum̐ baṭṭīm̐ baṭṭaramma pasibiḍḍam̐ḍemĕṟugu
dāmĕnagoḍĕlam̐ gŏṭṭīm̐ dāne vīm̐ḍu
kāmiṁchi mām̐kulĕkkīm̐ gādani mānubaramma
būmĕla yī bālunigi buddi sĕpparammā
(||ema||)
gāligem̐gīm̐ baṭṭaramma kaḍuśhiśhu vemĕṟugu
pāluvĕnnalu dŏṁgilī bālum̐ḍu vīḍu
ālirayai śhrī veṁkaḍāsalamu mīm̐di kĕkkĕ
ālum̐dānu nunnām̐ ḍadĕ sūḍarammā