Emamma nee kevvareedu yimdiraadevi

ఏమమ్మ నీ కెవ్వరీడు యిందిరాదేవి
Language

(॥పల్లవి॥)
ఏమమ్మ నీ కెవ్వరీడు యిందిరాదేవి
నీ మగనికి నీవు నిండునిధానమవు

(॥ఏమ॥)
చూపులనే కురిసేవు సొరిది బంగారుపొడి
తీపుల నీపతి కది తీరనిసొమ్ము
రూపుననే కులికేవు రుచుల రాజస మెల్ల
మోపులై యాతని కవె ముంగిటి సంపదలు

(॥ఏమ॥)
మోముననే మెరిచేవు మోహనపుమెరుఁగులు
కావించు నీ విభునికి కానదివ్వెలు
తామెరచేతుల నెత్తి దైవారేవు మహిమలు
ప్రేమపుమీయాతనికి పెట్టెలధనములు

(॥ఏమ॥)
పలుకులఁ జిలికేవు పైపైనే అమృతాలు
అలరి శ్రీ వేంకటేశు కవె మంత్రాలు
అలమేలుమంగవు నీ వాతనిఁ గూడితివిట్టె
చెలఁగి మీయిద్దరికి సేసిన భాగ్యములు

(||pallavi||)
emamma nī kĕvvarīḍu yiṁdirādevi
nī maganigi nīvu niṁḍunidhānamavu

(||ema||)
sūbulane kurisevu sŏridi baṁgārubŏḍi
tībula nībadi kadi tīranisŏmmu
rūbunane kuligevu rusula rājasa mĕlla
mobulai yādani kavĕ muṁgiḍi saṁpadalu

(||ema||)
momunane mĕrisevu mohanabumĕrum̐gulu
kāviṁchu nī vibhunigi kānadivvĕlu
tāmĕrasedula nĕtti daivārevu mahimalu
premabumīyādanigi pĕṭṭĕladhanamulu

(||ema||)
palugulam̐ jiligevu paibaine amṛtālu
alari śhrī veṁkaḍeśhu kavĕ maṁtrālu
alamelumaṁgavu nī vādanim̐ gūḍidiviṭṭĕ
sĕlam̐gi mīyiddarigi sesina bhāgyamulu