ఏమమ్మ మగువా నీ వింతసేతురా
(॥పల్లవి॥)
ఏమమ్మ మగువా నీ వింతసేతురా
తామసించనేఁటి కిఁక దయఁజూడవమ్మా
(॥ఏమ॥)
తగిలి తప్పకచూచు తలవంచు నంతలోనే
నిగిడి చింతారతి నేలదవ్వును
మగువ నిన్నిటువాసి మానుపడి వూరకుండు
అగడాయ నీపతి నదె చూడవమ్మా
(॥ఏమ॥)
దీనతతోఁ జిన్నఁ బోవు తెగువలే తలపోయు
తానే యేకతాననుండి తమకించును
మోమునఁ దెల్లఁబారు మోహించిన విరహాన
మానిని నీవే వచ్చేసి మరి చూడవమ్మా
(॥ఏమ॥)
కొచ్చినకాఁకలచేఁ బైకొంగువేయనెఱఁగఁడు
మెచ్చుగ మెట్టినచోటే మెట్టి భ్రమయు
అచ్చపు శ్రీవేంకటేశు నలమేలుమంగ నీవు
పచ్చిసేసి కూడితివి పంతమేఁటికమ్మా
(||pallavi||)
emamma maguvā nī viṁtasedurā
tāmasiṁchanem̐ṭi kim̐ka dayam̐jūḍavammā
(||ema||)
tagili tappagasūsu talavaṁchu naṁtalone
nigiḍi siṁtāradi neladavvunu
maguva ninniḍuvāsi mānubaḍi vūraguṁḍu
agaḍāya nībadi nadĕ sūḍavammā
(||ema||)
dīnadadom̐ jinnam̐ bovu tĕguvale talaboyu
tāne yegadānanuṁḍi tamagiṁchunu
momunam̐ dĕllam̐bāru mohiṁchina virahāna
mānini nīve vachchesi mari sūḍavammā
(||ema||)
kŏchchinagām̐kalasem̐ baigŏṁguveyanĕṟam̐gam̐ḍu
mĕchchuga mĕṭṭinasoḍe mĕṭṭi bhramayu
achchabu śhrīveṁkaḍeśhu nalamelumaṁga nīvu
pachchisesi kūḍidivi paṁtamem̐ṭigammā