Emamduru yeemaadagu nimdaroo ninnu

ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
Language

(॥పల్లవి॥)
ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
నీ మాయ యెంతైనా నిన్ను మించవచ్చునా

(॥ఏమం॥)
నేను నిన్నుఁ గొలిచితిని నీవు నన్ను నేలితివి
పాని పంచేంద్రియాలేల పనిగొనీని
కానిలేని బంట్లఁ దేరకాండ్లు వెట్టిగొనఁగ
దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా

(॥ఏమం॥)
పుట్టించినాఁడవు నీవు పుట్టినవాఁడను నేను
పట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాఁచితే
తట్టి నీవు వహించుకోఁదగదా సర్వేశ్వరా

(॥ఏమం॥)
యెదుట నీవు గలవు యిహములో నేఁ గలను
చెదరిన చిత్తమేల చిమ్మిరేఁచీని
అదన శ్రీవేంకటేశ అరితేరినట్టినన్ను
వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా

(||pallavi||)
emaṁduru yīmāḍagu niṁdarū ninnu
nī māya yĕṁtainā ninnu miṁchavachchunā

(||emaṁ||)
nenu ninnum̐ gŏlisidini nīvu nannu nelidivi
pāni paṁcheṁdriyālela panigŏnīni
kānileni baṁṭlam̐ deragāṁḍlu vĕṭṭigŏnam̐ga
dānigi nī kūraguṁḍa dharmamā sarveśhvarā

(||emaṁ||)
puṭṭiṁchinām̐ḍavu nīvu puṭṭinavām̐ḍanu nenu
paṭṭi karmamela nannu bādhabĕṭṭīni
vŏṭṭinasŏmmugu verŏgaru seyisām̐side
taṭṭi nīvu vahiṁchugom̐dagadā sarveśhvarā

(||emaṁ||)
yĕduḍa nīvu galavu yihamulo nem̐ galanu
sĕdarina sittamela simmirem̐sīni
adana śhrīveṁkaḍeśha ariderinaṭṭinannu
vadalaga rakṣhiṁchugo vannĕgā sarveśhvarā