Emamdune yimdu kitte ninnu

ఏమందునె యిందు కిట్టె నిన్ను
Language

(॥పల్లవి॥)
ఏమందునె యిందు కిట్టె నిన్ను
కామిను లిట్లైతే కాలమహి మెట్లో

(॥ఏమందునె॥)
అతఁడు నాతో నవ్వినట్టినవ్వు నీ మీఁదికి
యేతులకుఁ దీసుకొనే విది మేలే
పోతరించి వుప్పు వేసి పొత్తు గలయ వచ్చేవు
చేతులఁ బట్టఁగ రాదు చెలి కూ ళైతేను

(॥ఏ మందునె॥)
పేరుకొని నన్నతఁడు పిలువఁగ నది విని
యీరీతి నీవే పలికే విది మేలే
నీరువట్టు గొన్నవేళ నెయ్యి వోసే వాతనికి
ఆరయ సిగ్గు లేనియాఁటదె పసురమా

(॥ఏ మందునె॥)
చేయి నాపై వేయఁ బోతే శ్రీ వెంకటపతికి
యీయెడఁ గైదండ చిచ్చే విది మేలే
పాయక యీ శ్రీవెంకటపతియే నన్నునుఁ గూడె
చాయ యెఱఁగనియట్టి సతియె పో ములుచా

(||pallavi||)
emaṁdunĕ yiṁdu kiṭṭĕ ninnu
kāminu liṭlaide kālamahi mĕṭlo

(||emaṁdunĕ||)
adam̐ḍu nādo navvinaṭṭinavvu nī mīm̐digi
yedulagum̐ dīsugŏne vidi mele
podariṁchi vuppu vesi pŏttu galaya vachchevu
sedulam̐ baṭṭam̐ga rādu sĕli kū ḽaidenu

(||e maṁdunĕ||)
perugŏni nannadam̐ḍu piluvam̐ga nadi vini
yīrīdi nīve palige vidi mele
nīruvaṭṭu gŏnnaveḽa nĕyyi vose vādanigi
āraya siggu leniyām̐ṭadĕ pasuramā

(||e maṁdunĕ||)
seyi nābai veyam̐ bode śhrī vĕṁkaḍabadigi
yīyĕḍam̐ gaidaṁḍa sichche vidi mele
pāyaga yī śhrīvĕṁkaḍabadiye nannunum̐ gūḍĕ
sāya yĕṟam̐ganiyaṭṭi sadiyĕ po mulusā