Emamdune seliya imta sesenu vayasu

ఏమందునే చెలియ ఇంత సేసెను వయసు
Language

(॥పల్లవి॥)
ఏమందునే చెలియ ఇంత సేసెను వయసు
నా మనసు చొక్కించి నమ్మించె వయసు

(॥ఏమందు॥)
పుడివోని తమకముల నుబ్బురేఁచెను వయసు
కడఁగి యలుకలు దేర్చి కలపె వయసు
అడియాసలే పెంచి యారడిఁ బెట్టెను వయసు
బడిఁ గోరికలబయలు వాఁకించె వయసు

(॥ఏమందు॥)
సాగిసి రాకల కెదురుచూడఁ జేసెను వయసు
తగిలించి రతుల కెడతాకించె వయసు
వెగటుగాఁ దెగువలకు వెఱపుఁదెలిపెను వయసు
జిగిమించి తలపోఁతఁ జిక్కించె వయసు

(॥ఏమందు॥)
వొకరి కొకరికి లంకె లొనకఁజేసెను వయసు
మొకమోటలనె ననుపు ముంచె వయసు
వెకలియై కూర్చి శ్రీవేంకటేశుతో వయసు
ప్రకటమై నాకిట్ల ఫలియించె వయసు

(||pallavi||)
emaṁdune sĕliya iṁta sesĕnu vayasu
nā manasu sŏkkiṁchi nammiṁchĕ vayasu

(||emaṁdu||)
puḍivoni tamagamula nubburem̐sĕnu vayasu
kaḍam̐gi yalugalu dersi kalabĕ vayasu
aḍiyāsale pĕṁchi yāraḍim̐ bĕṭṭĕnu vayasu
baḍim̐ gorigalabayalu vām̐kiṁchĕ vayasu

(||emaṁdu||)
sāgisi rāgala kĕdurusūḍam̐ jesĕnu vayasu
tagiliṁchi radula kĕḍadāgiṁchĕ vayasu
vĕgaḍugām̐ dĕguvalagu vĕṟabum̐dĕlibĕnu vayasu
jigimiṁchi talabom̐tam̐ jikkiṁchĕ vayasu

(||emaṁdu||)
vŏgari kŏgarigi laṁkĕ lŏnagam̐jesĕnu vayasu
mŏgamoḍalanĕ nanubu muṁchĕ vayasu
vĕgaliyai kūrsi śhrīveṁkaḍeśhudo vayasu
pragaḍamai nāgiṭla phaliyiṁchĕ vayasu