(॥పల్లవి॥)
ఏమందునే నేను యీతనితోడ
వేమారు నన్ను లాలించి వేఁడుకొనీఁ దాను
(॥ఏమం॥)
సరవెనఁగ వచ్చునా సాదించవచ్చునా
దొరతోడ నెంతైనా తొయ్యలులకు
తరుని చూడఁగదె యాతఁడు సారె సారెకు
విరిబంతులను వేసి వీడెమిచ్చీ నాకు
(॥ఏమం॥)
కాలు దాఁకించవచ్చునా కడుఁ జెనకవచ్చునా
యేలికతో వెరవక యింతులకును
తాలిమితో నడుగవే తానెంత నేనెంత
నాలికా డూరకే విచ్చి నవ్వులు నవ్వీని
(॥ఏమం॥)
వావులు చెప్పవచ్చునా వాడిక చూపవచ్చునా
శ్రీవేంకటేశుతో డాసి చెలులకును
యావేళ వినవే నేఁ డీతఁడే నన్నుఁ గూడె
మోవితేనె మరిగించి ముంచి నమ్మించీని
(||pallavi||)
emaṁdune nenu yīdanidoḍa
vemāru nannu lāliṁchi vem̐ḍugŏnīm̐ dānu
(||emaṁ||)
saravĕnam̐ga vachchunā sādiṁchavachchunā
dŏradoḍa nĕṁtainā tŏyyalulagu
taruni sūḍam̐gadĕ yādam̐ḍu sārĕ sārĕgu
viribaṁtulanu vesi vīḍĕmichchī nāgu
(||emaṁ||)
kālu dām̐kiṁchavachchunā kaḍum̐ jĕnagavachchunā
yeligado vĕravaga yiṁtulagunu
tālimido naḍugave tānĕṁta nenĕṁta
nāligā ḍūrage vichchi navvulu navvīni
(||emaṁ||)
vāvulu sĕppavachchunā vāḍiga sūbavachchunā
śhrīveṁkaḍeśhudo ḍāsi sĕlulagunu
yāveḽa vinave nem̐ ḍīdam̐ḍe nannum̐ gūḍĕ
movidenĕ marigiṁchi muṁchi nammiṁchīni