ఏమందుము నే మిందుకు యెదురుమాట
(॥పల్లవి॥)
ఏమందుము నే మిందుకు యెదురుమాట
ఆ మతకమెల్లా నాకు నానతియ్యవయ్యా
(॥ఏమం॥)
వొకమాట మీదఁబెట్టి వొకమాట లాడేవు
వెకలివై కొంతగొంత వేరే నవ్వేవు
మొకము చూచితేనే మోహములు చల్లేవు
యెకసక్కేలో నిజమో యెఱఁగరాదయ్యా
(॥ఏమం॥)
కొంత పరాకులుసేసి కొంగువట్టి తీసేవు
చెంతల దగ్గరి నీవే సిగ్గువడేవు
దొంతిఁ బెట్టి వలపులు దోమట్లు దొడికేవు
పంతానకో భక్తి గద్దో భావించరాదయ్యా
(॥ఏమం॥)
నయగారములు చూపి నన్ను నిట్టే కూడేవు
ప్రియములు చెప్పి రతిఁ బెదరేఁచేవు
నియతి శ్రీవేంకటేశ నీవే నన్ను మెచ్చేవు
దయనో తరితీపులకో తలఁచరాదయ్యా
(||pallavi||)
emaṁdumu ne miṁdugu yĕdurumāḍa
ā madagamĕllā nāgu nānadiyyavayyā
(||emaṁ||)
vŏgamāḍa mīdam̐bĕṭṭi vŏgamāḍa lāḍevu
vĕgalivai kŏṁtagŏṁta vere navvevu
mŏgamu sūsidene mohamulu sallevu
yĕgasakkelo nijamo yĕṟam̐garādayyā
(||emaṁ||)
kŏṁta parāgulusesi kŏṁguvaṭṭi tīsevu
sĕṁtala daggari nīve sigguvaḍevu
dŏṁtim̐ bĕṭṭi valabulu domaṭlu dŏḍigevu
paṁtānago bhakti gaddo bhāviṁcharādayyā
(||emaṁ||)
nayagāramulu sūbi nannu niṭṭe kūḍevu
priyamulu sĕppi radim̐ bĕdarem̐sevu
niyadi śhrīveṁkaḍeśha nīve nannu mĕchchevu
dayano taridībulago talam̐sarādayyā