Emamdu naa guna mide yemta mohimchidino

ఏమందు నా గుణ మిదె యెంత మోహించితినో
Language

(॥పల్లవి॥)
ఏమందు నా గుణ మిదె యెంత మోహించితినో
చేముట్టి నీ మీఁదనున్న చేయి దియ్యఁ జాలరా

(॥ఏ మందు॥)
చెప్ప రానిమాట లైన జేసేఁ గాని నీతో
నప్పటి నెదురు మాటలాడ నోపరా
కుప్పళించి పెంజెమట గురిసేఁ గాని నీకుఁగా
తప్ప కిట్టె మోము చూచి తలవంచ నోపరా

(॥ఏమందు॥)
నేయ రానిపని కైన చేరి వొడిగట్టేఁ గాని
ఆయెడె నిన్నుఁ బాసే అందు కోపరా
చాయల సరసమున సందడిఁ బొరలేఁ గాని
పాయపుమదాన సిగ్గువడఁగ నే నోపరా

(॥ఏముందు॥)
యేకతాన నెందు నైన నియ్యకొనేఁ గాని నిన్నుఁ
గాకుగా మందెమేళాలఁ గప్ప నోపరా
యీకడ శ్రీవెంకటేశ యిట్లాఁ గూడుండేఁ గాని
దాకొని జంకించి నిన్ను తక్కించ నోపరా

(||pallavi||)
emaṁdu nā guṇa midĕ yĕṁta mohiṁchidino
semuṭṭi nī mīm̐danunna seyi diyyam̐ jālarā

(||e maṁdu||)
sĕppa rānimāḍa laina jesem̐ gāni nīdo
nappaḍi nĕduru māḍalāḍa nobarā
kuppaḽiṁchi pĕṁjĕmaḍa gurisem̐ gāni nīgum̐gā
tappa kiṭṭĕ momu sūsi talavaṁcha nobarā

(||emaṁdu||)
neya rānibani kaina seri vŏḍigaṭṭem̐ gāni
āyĕḍĕ ninnum̐ bāse aṁdu kobarā
sāyala sarasamuna saṁdaḍim̐ bŏralem̐ gāni
pāyabumadāna sigguvaḍam̐ga ne nobarā

(||emuṁdu||)
yegadāna nĕṁdu naina niyyagŏnem̐ gāni ninnum̐
gāgugā maṁdĕmeḽālam̐ gappa nobarā
yīgaḍa śhrīvĕṁkaḍeśha yiṭlām̐ gūḍuṁḍem̐ gāni
dāgŏni jaṁkiṁchi ninnu takkiṁcha nobarā