ఏమైనానయ్యీఁ గాక యెందాఁకనే
(॥పల్లవి॥)
ఏమైనానయ్యీఁ గాక యెందాఁకనే
ఆమని పచ్చలమీఁది ఆసలెందాఁకనే
(॥॥)
తానే వచ్చీఁగాక తగిలి పిలువనేల
యేనుగఁ గఁబానఁదీనే దెందాఁకనే
కానీలేవే వానిచేఁత కాదుగూడదననోప
మానవిగుణములకు మందు లెందాఁకనే
(॥॥)
తీఱీ నలుకలు దానే దీమస మెడలనేల
యేఱులు వంకలు దిద్దే దెందాఁకనే
ఆఱడి సేయఁగనేల అంది పొంది పాయనోప
నూఱేటివెన్నలకు నును పెందాఁకనే
(॥॥)
ఆండనే శ్రీవేంకటేశుఁడాదరించి నన్నుఁగూడె
యెండమావులదప్పు లెందాఁకనే
నిండుదొర వీనిమీఁద నేరమెంచ నే నోప
వండ వండనట్లయినవాసు లెందాఁకానే
(||pallavi||)
emainānayyīm̐ gāga yĕṁdām̐kane
āmani pachchalamīm̐di āsalĕṁdām̐kane
(||||)
tāne vachchīm̐gāga tagili piluvanela
yenugam̐ gam̐bānam̐dīne dĕṁdām̐kane
kānīleve vānisem̐ta kādugūḍadananoba
mānaviguṇamulagu maṁdu lĕṁdām̐kane
(||||)
tīṟī nalugalu dāne dīmasa mĕḍalanela
yeṟulu vaṁkalu didde dĕṁdām̐kane
āṟaḍi seyam̐ganela aṁdi pŏṁdi pāyanoba
nūṟeḍivĕnnalagu nunu pĕṁdām̐kane
(||||)
āṁḍane śhrīveṁkaḍeśhum̐ḍādariṁchi nannum̐gūḍĕ
yĕṁḍamāvuladappu lĕṁdām̐kane
niṁḍudŏra vīnimīm̐da neramĕṁcha ne noba
vaṁḍa vaṁḍanaṭlayinavāsu lĕṁdām̐kāne