ఏమైనాఁ జేతువు గాక యింత సేతురా
(॥పల్లవి॥)
ఏమైనాఁ జేతువు గాక యింత సేతురా
బూమిలోనివారి నన్నుఁ బురుఁడు వెట్టుదురా
(॥ఏమైనా॥)
చిత్తము రాకుండితేను చేర రాకు మందు గాక
పొత్తులయాకె చేఁతలు పొగడింతురా
వొత్తి నాతోఁ గోపమైతే వూరక తిట్టుత గాక
మెత్తిన యాడో గందము మేనఁ బూయవలెనా
(॥ఏమైనా॥)
అంత వొల్లకుండితే నా ఆయాలు దాఁకింతు గాక
వింతసతిపొత్తునకు వేడుకఁ బిలుతురా
చెంతల నా కలిగితే సెలవు వెట్టుత గాక
పొంతవారి నాయెదుట పోది సేయవలెనా
(॥ఏమైనా॥)
యీయకోలై తే నా యింటికి విచ్చేతు గాక
రాయడివారిండ్లకు రమ్మందురా
చాయల శ్రీ వేంకటేశ చన విచ్చి కూడితివి
మాయలు తొల్లిటి వెల్లా మరపింతురా
(||pallavi||)
emainām̐ jeduvu gāga yiṁta sedurā
būmilonivāri nannum̐ burum̐ḍu vĕṭṭudurā
(||emainā||)
sittamu rāguṁḍidenu sera rāgu maṁdu gāga
pŏttulayāgĕ sem̐talu pŏgaḍiṁturā
vŏtti nādom̐ gobamaide vūraga tiṭṭuda gāga
mĕttina yāḍo gaṁdamu menam̐ būyavalĕnā
(||emainā||)
aṁta vŏllaguṁḍide nā āyālu dām̐kiṁtu gāga
viṁtasadibŏttunagu veḍugam̐ biludurā
sĕṁtala nā kaligide sĕlavu vĕṭṭuda gāga
pŏṁtavāri nāyĕduḍa podi seyavalĕnā
(||emainā||)
yīyagolai te nā yiṁṭigi vichchedu gāga
rāyaḍivāriṁḍlagu rammaṁdurā
sāyala śhrī veṁkaḍeśha sana vichchi kūḍidivi
māyalu tŏlliḍi vĕllā marabiṁturā