Emainaam gaa nerusu nee devumdu

ఏమైనాఁ గా నేరుచు నీ దేవుఁడు
Language

(॥పల్లవి॥)
ఏమైనాఁ గా నేరుచు నీ దేవుఁడు
కామించిన వారివారి కల్పవృక్షము

(॥ఏమై॥)
చప్పుడుగాఁ బన్నీటను జలకములాడేవేళ
గొప్పనవరసముల గుళి గైనాఁడు
దెప్పరమై కప్రకాపు దేహనఁ బూసినవేళ
తప్పకుండ ఘనసారతరు వైనాఁడు

(॥ఏమై॥)
అంచలఁ దట్టుపుణుఁగు అలఁదుకొనినవేళ
మించినట్టి చమరీమృగ మైనాఁడు
కాంచనపు సొమ్ములు అంగముల ధరియించువేళ
కొంచని సంపంగిపువ్వుగుత్తి యైనాఁడు

(॥ఏమై॥)
మిక్కిలి యలమేల్మంగ మెడఁగట్టుకొన్నవేళ
దక్కినట్టి ముంగిటినిధాన మైనాఁడు
యెక్కువై శ్రీవేంకటేశుఁ డిట్టే కొలువున్నవేళ
పక్కన నన్నిటాఁ బరబ్రహ్మమైనా డు

(||pallavi||)
emainām̐ gā nerusu nī devum̐ḍu
kāmiṁchina vārivāri kalbavṛkṣhamu

(||emai||)
sappuḍugām̐ bannīḍanu jalagamulāḍeveḽa
gŏppanavarasamula guḽi gainām̐ḍu
dĕpparamai kapragābu dehanam̐ būsinaveḽa
tappaguṁḍa ghanasāradaru vainām̐ḍu

(||emai||)
aṁchalam̐ daṭṭubuṇum̐gu alam̐dugŏninaveḽa
miṁchinaṭṭi samarīmṛga mainām̐ḍu
kāṁchanabu sŏmmulu aṁgamula dhariyiṁchuveḽa
kŏṁchani saṁpaṁgibuvvugutti yainām̐ḍu

(||emai||)
mikkili yalamelmaṁga mĕḍam̐gaṭṭugŏnnaveḽa
dakkinaṭṭi muṁgiḍinidhāna mainām̐ḍu
yĕkkuvai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭe kŏluvunnaveḽa
pakkana nanniḍām̐ barabrahmamainā ḍu