Emainaa nanu yeduraada nenu

ఏమైనా నను యెదురాడ నేను
Language

(॥పల్లవి॥)
ఏమైనా నను యెదురాడ నేను
దీమసంబుతోఁ దెలిసితి నేను

(॥ఏమై॥)
యెక్కుడుమాట నే నేమనియాడిన
వెక్కసురాలని విసుగుదువు
మొక్కుచు నీపాదములు చూచుక ఇటు
వొక్కట నూరకయుండెద నేను

(॥ఏమై॥)
పంతంబున నేఁ బైకొని నవ్విన
అంతరట్టడని యాడుదువు
చెంత నూడిగము సేసుక నీకిట్టె
చింతదీరి కడుచెలగెద నేను

(॥ఏమై॥)
ఆలమి నిన్ను రతి నలయించినను
బలిమితోడిదని పలుకుదువు
యెలమిని శ్రీవేంకటేశ్వర కూడితి
మెలగినట్లనే మెచ్చెద నేను

(||pallavi||)
emainā nanu yĕdurāḍa nenu
dīmasaṁbudom̐ dĕlisidi nenu

(||emai||)
yĕkkuḍumāḍa ne nemaniyāḍina
vĕkkasurālani visuguduvu
mŏkkusu nībādamulu sūsuga iḍu
vŏkkaḍa nūragayuṁḍĕda nenu

(||emai||)
paṁtaṁbuna nem̐ baigŏni navvina
aṁtaraṭṭaḍani yāḍuduvu
sĕṁta nūḍigamu sesuga nīgiṭṭĕ
siṁtadīri kaḍusĕlagĕda nenu

(||emai||)
ālami ninnu radi nalayiṁchinanu
balimidoḍidani paluguduvu
yĕlamini śhrīveṁkaḍeśhvara kūḍidi
mĕlaginaṭlane mĕchchĕda nenu