ఏమైనా నాయఁగాక ఇఁకనీతో యేమనేము
(॥పల్లవి॥)
ఏమైనా నాయఁగాక ఇఁకనీతో యేమనేము
భూమిలో యెవ్వతె నిన్ను భోగించి వేసినదో
(॥ఏమై॥)
వలచినవారికి వాసులెంచనున్నదా
వొలిసినందుకెల్లాను వొగ్గుట గాక
పిలిచిపెట్టేవు నాకు పదవిమీఁదటితమ్మ
యెలయించి తొల్లి నీకు యెవ్వతె వెట్టినదో
(॥ఏమై॥)
పెండిలాడిన వారికి బిగియఁగ వున్నదా
అండ నెట్టు పరచినా నౌనంట గాక
గండుమీరి రొమ్ముమీఁది గందము వూసేవు నాకు
మెండుగ నెవ్వతె వూసి మిగిలించినదో
(॥ఏమై॥)
మేనరికపువారికి మేకు సేయ నున్న దా
మోనాన కాఁగిటఁ గూడి మొక్కుట గాక
కానీలే శ్రీ వేంకటేశ కలసి విరులిచ్చేవు
వూని యెవ్వతె కొప్పుననుండి వచ్చినదో
(||pallavi||)
emainā nāyam̐gāga im̐kanīdo yemanemu
bhūmilo yĕvvadĕ ninnu bhogiṁchi vesinado
(||emai||)
valasinavārigi vāsulĕṁchanunnadā
vŏlisinaṁdugĕllānu vŏgguḍa gāga
pilisibĕṭṭevu nāgu padavimīm̐daḍidamma
yĕlayiṁchi tŏlli nīgu yĕvvadĕ vĕṭṭinado
(||emai||)
pĕṁḍilāḍina vārigi bigiyam̐ga vunnadā
aṁḍa nĕṭṭu parasinā naunaṁṭa gāga
gaṁḍumīri rŏmmumīm̐di gaṁdamu vūsevu nāgu
mĕṁḍuga nĕvvadĕ vūsi migiliṁchinado
(||emai||)
menarigabuvārigi megu seya nunna dā
monāna kām̐giḍam̐ gūḍi mŏkkuḍa gāga
kānīle śhrī veṁkaḍeśha kalasi virulichchevu
vūni yĕvvadĕ kŏppunanuṁḍi vachchinado