Emainaa gunamu taa neṟamganidaa

ఏమైనా గుణము తా నెఱఁగనిదా
Language

(॥పల్లవి॥)
ఏమైనా గుణము తా నెఱఁగనిదా
ఆముకొని లోలోఁ దానే ఆలకించీఁ గాక

(॥ఏమై॥)
సేసవెట్టిన వాఁడు నాచేతికిలోనైన వాఁడు
ఆసల నేఁపుదురా అట్టె తాను
వాసిగలదాననేను వలచిన దాన నేను
వేస రొక్కపరియైనా వెంగెమాడేనా

(॥ఏమై॥)
మనసెఱింగిన వాఁడు మాట నాకిచ్చిన వాఁడు
పెనఁగులాడుదురా బెట్టుగాఁ దాను
చనవు గలదు నాకు సరసము లబ్బె నాకు
తనమీఁద సారెసారెఁ దప్పులెంచేనా

(॥ఏమై॥)
చెక్కులు నొక్కిన వాఁడు సిగ్గులు దేర్పినవాఁడు
కక్కసించి నవ్వుదురా కలసి తాను
ఇక్కువల శ్రీవేంకటేశుఁడు తాఁగూడె నన్ను
దక్కినాఁడు తను నేఁ బంతము గొనేనా

(||pallavi||)
emainā guṇamu tā nĕṟam̐ganidā
āmugŏni lolom̐ dāne ālagiṁchīm̐ gāga

(||emai||)
sesavĕṭṭina vām̐ḍu nāsedigilonaina vām̐ḍu
āsala nem̐pudurā aṭṭĕ tānu
vāsigaladānanenu valasina dāna nenu
vesa rŏkkabariyainā vĕṁgĕmāḍenā

(||emai||)
manasĕṟiṁgina vām̐ḍu māḍa nāgichchina vām̐ḍu
pĕnam̐gulāḍudurā bĕṭṭugām̐ dānu
sanavu galadu nāgu sarasamu labbĕ nāgu
tanamīm̐da sārĕsārĕm̐ dappulĕṁchenā

(||emai||)
sĕkkulu nŏkkina vām̐ḍu siggulu derbinavām̐ḍu
kakkasiṁchi navvudurā kalasi tānu
ikkuvala śhrīveṁkaḍeśhum̐ḍu tām̐gūḍĕ nannu
dakkinām̐ḍu tanu nem̐ baṁtamu gŏnenā