Emaina naayamgaaga yimta saaladaa

ఏమైన నాయఁగాక యింత చాలదా
Language

(॥పల్లవి॥)
ఏమైన నాయఁగాక యింత చాలదా
ఆ మీఁద నీవు నన్నాదరించకుందువా

(॥ఏమై॥)
తెగి నన్నుఁ గోపించితేఁ గోపింతువు గాక
వగగా వెనక వగవక మానేవా
వెగటు చెప్పుడుమాఁట వింటే విందువుగాక
నిగుడి వనిత నీవు నిజపట్టేవా

(॥ఏమై॥)
అలిగి నీ వావలిమోమైతే నవుదువుగాక
చలివాయ మతిఁదలఁచకమానేవా
కలఁగి నీచలమిది గట్టియైతే నాయఁగాక
మెలుఁత నీదయ నాకు మెత్తనేకాదా

(॥ఏమై॥)
సొరిది చూపుల నాఁటఁజూచితేఁ జూతువుగాక
సరుస చల్లనినవ్వు చల్లకుండేవా
పరగ శ్రీవేంకటాద్రిపతినైన నన్నుఁ గూడి
కరగతి వింతగాక గాతసేసేవా

(||pallavi||)
emaina nāyam̐gāga yiṁta sāladā
ā mīm̐da nīvu nannādariṁchaguṁduvā

(||emai||)
tĕgi nannum̐ gobiṁchidem̐ gobiṁtuvu gāga
vagagā vĕnaga vagavaga mānevā
vĕgaḍu sĕppuḍumām̐ṭa viṁṭe viṁduvugāga
niguḍi vanida nīvu nijabaṭṭevā

(||emai||)
aligi nī vāvalimomaide navuduvugāga
salivāya madim̐dalam̐sagamānevā
kalam̐gi nīsalamidi gaṭṭiyaide nāyam̐gāga
mĕlum̐ta nīdaya nāgu mĕttanegādā

(||emai||)
sŏridi sūbula nām̐ṭam̐jūsidem̐ jūduvugāga
sarusa sallaninavvu sallaguṁḍevā
paraga śhrīveṁkaḍādribadinaina nannum̐ gūḍi
karagadi viṁtagāga gādasesevā