ఏమాయనే రమణుని నీ వెంతదూరినాను
(॥పల్లవి॥)
ఏమాయనే రమణుని నీ వెంతదూరినాను
నేమమున నీపైనేల నేర మెంచుకొనీనే
(॥॥)
వేడుక వెగ్గళమైతే విసువు గొంత గలుగు
వీడెములోనే కారము వెదకితేను
నీడములోనే వుండినాను నిందింపించు జలువను
కూడిన వారొకవేళ గుంపించు టేమరుదు
(॥॥)
సరసమాడేయందే చలమూఁ గొంత గలుగు
వీడేములోనే కారము మరుబాణాలు
సురతము సేయఁ గానే చొక్కి మేను మరపించు
సరినున్నదంపతులు జంకించు టేమరుదు
(॥॥)
కలసినకాఁగిటిలో కడువలపు గలుగు
వెలసితేఁ దురుమందే వేఁకము నుండు
యెలమి శ్రీ వేంకటేశుఁ డేలె నీ వొక్కటైతివి
వలచినవారు గొంతసొలయు టేమరుదు
(||pallavi||)
emāyane ramaṇuni nī vĕṁtadūrinānu
nemamuna nībainela nera mĕṁchugŏnīne
(||||)
veḍuga vĕggaḽamaide visuvu gŏṁta galugu
vīḍĕmulone kāramu vĕdagidenu
nīḍamulone vuṁḍinānu niṁdiṁpiṁchu jaluvanu
kūḍina vārŏgaveḽa guṁpiṁchu ṭemarudu
(||||)
sarasamāḍeyaṁde salamūm̐ gŏṁta galugu
vīḍemulone kāramu marubāṇālu
suradamu seyam̐ gāne sŏkki menu marabiṁchu
sarinunnadaṁpadulu jaṁkiṁchu ṭemarudu
(||||)
kalasinagām̐giḍilo kaḍuvalabu galugu
vĕlasidem̐ durumaṁde vem̐kamu nuṁḍu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍelĕ nī vŏkkaḍaidivi
valasinavāru gŏṁtasŏlayu ṭemarudu