Emaayanayaa yimtadilone

ఏమాయనయా యింతటిలోనే
Language

(॥పల్లవి॥)
ఏమాయనయా యింతటిలోనే
కామునికి నివి గల సహజములు

(॥॥)
చనవరికాంతలు సరసములాడఁగ
ననుపున విభుఁడవు నవ్వితివి
పెనుఁగుచు రమ్మని పేరునఁ బిలువఁగ
పనివడి యట్టే పలికితివి

(॥॥)
కొలువు కామినులు కుచములు చూపిన
సొలయుచుఁ దప్పక చూచితివి
కలువ పువ్వులటు కానుక లిచ్చిన
అలరి కరంబుల నందితివి

(॥॥)
వూడిగపుసతులు వొడి వట్టుకొనిన
వేడుకతో బెండ్లాడితివి
యీడనె శ్రీవేంకటేశ నన్నెనసి
తోడనె దోమటి దొడికితివి

(||pallavi||)
emāyanayā yiṁtaḍilone
kāmunigi nivi gala sahajamulu

(||||)
sanavarigāṁtalu sarasamulāḍam̐ga
nanubuna vibhum̐ḍavu navvidivi
pĕnum̐gusu rammani perunam̐ biluvam̐ga
panivaḍi yaṭṭe paligidivi

(||||)
kŏluvu kāminulu kusamulu sūbina
sŏlayusum̐ dappaga sūsidivi
kaluva puvvulaḍu kānuga lichchina
alari karaṁbula naṁdidivi

(||||)
vūḍigabusadulu vŏḍi vaṭṭugŏnina
veḍugado bĕṁḍlāḍidivi
yīḍanĕ śhrīveṁkaḍeśha nannĕnasi
toḍanĕ domaḍi dŏḍigidivi