ఏమాయ నింతలోను ఇట్టె చెప్పినట్టు సేసి
(॥పల్లవి॥)
ఏమాయ నింతలోను ఇట్టె చెప్పినట్టు సేసి
భామకు నీ వొకమాటు పంతమియ్యరాదా
(॥॥)
బలిమిఁ బానుపుమీఁ దఁ బవళించి వున్న దదె
వెలఁదిని వొకమాటు వేఁడుకొనరాదా
చెలులము బుద్దులెల్లాఁ జెప్పి వేసరితి మిదె
ములువాఁడి గోరిచేత మొక్కఁగరాదా
(॥॥)
దీమసాన నేకతానఁ దెరవేసుకొన్న దిదె
కోమలి తొడమీఁదఁ గూచుండరాదా
నేమెల్లాఁ బ్రియముచెప్ప నేరిపితి మిందాఁకా
వేమారుఁ జెక్కులు నొక్కి విడెమియ్యరాదా
(॥॥)
తమకాన నీ యెదుటఁ దలవంచుకున్న దిదె
కొమరెఁ గాఁగిట నిట్టె కూడఁగరాదా
మముఁ జూచి నీకె నిట్టె మన్నించి శ్రీ వేంకటేశ
సముకాన నీమోవి చవిచూపరాదా
(||pallavi||)
emāya niṁtalonu iṭṭĕ sĕppinaṭṭu sesi
bhāmagu nī vŏgamāḍu paṁtamiyyarādā
(||||)
balimim̐ bānubumīm̐ dam̐ bavaḽiṁchi vunna dadĕ
vĕlam̐dini vŏgamāḍu vem̐ḍugŏnarādā
sĕlulamu buddulĕllām̐ jĕppi vesaridi midĕ
muluvām̐ḍi goriseda mŏkkam̐garādā
(||||)
dīmasāna negadānam̐ dĕravesugŏnna didĕ
komali tŏḍamīm̐dam̐ gūsuṁḍarādā
nemĕllām̐ briyamusĕppa neribidi miṁdām̐kā
vemārum̐ jĕkkulu nŏkki viḍĕmiyyarādā
(||||)
tamagāna nī yĕduḍam̐ dalavaṁchugunna didĕ
kŏmarĕm̐ gām̐giḍa niṭṭĕ kūḍam̐garādā
mamum̐ jūsi nīgĕ niṭṭĕ manniṁchi śhrī veṁkaḍeśha
samugāna nīmovi savisūbarādā