Emaaya neegunu yimta maagu lomgidenu

ఏమాయ నీకును యింత మాకు లోఁగితేను
Language

(॥పల్లవి॥)
ఏమాయ నీకును యింత మాకు లోఁగితేను
కామించినవారు గాని కతసేయ నేరరు

(॥॥)
వలచినవారు గాని వడిఁ గొసర నేరరు
పలికేటివారు గాని పంతమియ్యరు
కలసేటివారు గాని కాఁతాళించ నేరరు
యెలమి మామటలేల యెగ్గపట్టేవయ్యా

(॥॥)
చుట్టాలైనవారు గాని సొలయఁగ నేరరు
వొట్టు వెట్టేవారు గాని వొడ్డుకొనరు
తిట్టినట్టివారు గాని దీవించ నేరరు
నెట్టిన మానవ్వులేల రట్టు సేసేవయ్యా

(॥॥)
పాయకుండేవారు గాని బలిమి సేయనేరరు
రాయడించేవారు గాని రతిఁ జొక్కరు
యీయెడ శ్రీవేంకటేశ యిటు నే నిన్నుఁ గూడితి
యేయెడ మాప్రియమేల యింతసేసేవయ్యా

(||pallavi||)
emāya nīgunu yiṁta māgu lom̐gidenu
kāmiṁchinavāru gāni kadaseya neraru

(||||)
valasinavāru gāni vaḍim̐ gŏsara neraru
paligeḍivāru gāni paṁtamiyyaru
kalaseḍivāru gāni kām̐tāḽiṁcha neraru
yĕlami māmaḍalela yĕggabaṭṭevayyā

(||||)
suṭṭālainavāru gāni sŏlayam̐ga neraru
vŏṭṭu vĕṭṭevāru gāni vŏḍḍugŏnaru
tiṭṭinaṭṭivāru gāni dīviṁcha neraru
nĕṭṭina mānavvulela raṭṭu sesevayyā

(||||)
pāyaguṁḍevāru gāni balimi seyaneraru
rāyaḍiṁchevāru gāni radim̐ jŏkkaru
yīyĕḍa śhrīveṁkaḍeśha yiḍu ne ninnum̐ gūḍidi
yeyĕḍa māpriyamela yiṁtasesevayyā