ఏమాయ నందుకునేల వేగిరించేవు
(॥పల్లవి॥)
ఏమాయ నందుకునేల వేగిరించేవు
నీ మాటలన్నియును నిజమయ్యీఁగాక
(॥॥)
సందడిలో నిన్ను నాచన్నులు దాఁకితేను
కందువల నిది యెంతగబ్బి యనేవు
గందవొడి చల్లుకోఁగా గాలి నీపైఁ బారితే
కెందమ్మిపువ్వులనేల కెరలి వేసేవు
(॥॥)
కురులు దువ్వుకోఁగా కొప్పు నీపై జారెనంటా
గొరబు సేసి నన్ను గోర గీరేవు
పరగ మేడ యెక్కఁగా పైఁజిందెఁ జెమటలంటా
సరుగఁ గప్పురమేల చల్లేవు నామీఁదను
(॥॥)
యిట్టె బంతిఁ గూచుండఁగ నెంగిలి సోఁకెనంటాను
బెట్టుగఁ గాగిట గుచ్చి బిగియించేవు
నెట్టన శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
చుట్టమవై నన్ను నెంత చొక్కులఁ బెట్టేవు
(||pallavi||)
emāya naṁdugunela vegiriṁchevu
nī māḍalanniyunu nijamayyīm̐gāga
(||||)
saṁdaḍilo ninnu nāsannulu dām̐kidenu
kaṁduvala nidi yĕṁtagabbi yanevu
gaṁdavŏḍi sallugom̐gā gāli nībaim̐ bāride
kĕṁdammibuvvulanela kĕrali vesevu
(||||)
kurulu duvvugom̐gā kŏppu nībai jārĕnaṁṭā
gŏrabu sesi nannu gora gīrevu
paraga meḍa yĕkkam̐gā paim̐jiṁdĕm̐ jĕmaḍalaṁṭā
sarugam̐ gappuramela sallevu nāmīm̐danu
(||||)
yiṭṭĕ baṁtim̐ gūsuṁḍam̐ga nĕṁgili som̐kĕnaṁṭānu
bĕṭṭugam̐ gāgiḍa guchchi bigiyiṁchevu
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
suṭṭamavai nannu nĕṁta sŏkkulam̐ bĕṭṭevu