(॥పల్లవి॥)
ఏమాటకేమాట యేమే నీవు వోరి
ఆమాటకామాట లవి యంతే కావా
(॥ఏమా॥)
పచ్చిపాలు పోయవుగా పసిగొల్లెతా అవె
పచ్చిపచ్చి అయ్యీఁగాని పదరా నీవు
పచ్చిచిగురే కాదా భామ నీమోవి నీవు
పచ్చిగాఁ దిరుఁగఁగాను పసురెక్కకుండునా
(॥ఏమా॥)
పెరుగు వెట్టవుగా గుంపెనగొల్లెతా నీవు
పెరిగి యింతై తివి పెక్కులేలర
పెరుగు నీకుచములు పిక్కటిల్లను నీవు
పెరుగఁగ నవి కడుఁబెద్దలు గాకుండునా
(॥ఏమా॥)
వెన్నలైనఁ బెట్టవుగా వెడగొల్లెతా నిన్ను
వెన్నకంటె నున్నఁ జేసే వేగమేలరా
వెన్నతోఁ బెట్టినది యీవేషము నీకు
వెన్నలఁ గూడితి శ్రీవేంకటేశ చాలదా
(||pallavi||)
emāḍagemāḍa yeme nīvu vori
āmāḍagāmāḍa lavi yaṁte kāvā
(||emā||)
pachchibālu poyavugā pasigŏllĕdā avĕ
pachchibachchi ayyīm̐gāni padarā nīvu
pachchisigure kādā bhāma nīmovi nīvu
pachchigām̐ dirum̐gam̐gānu pasurĕkkaguṁḍunā
(||emā||)
pĕrugu vĕṭṭavugā guṁpĕnagŏllĕdā nīvu
pĕrigi yiṁtai tivi pĕkkulelara
pĕrugu nīgusamulu pikkaḍillanu nīvu
pĕrugam̐ga navi kaḍum̐bĕddalu gāguṁḍunā
(||emā||)
vĕnnalainam̐ bĕṭṭavugā vĕḍagŏllĕdā ninnu
vĕnnagaṁṭĕ nunnam̐ jese vegamelarā
vĕnnadom̐ bĕṭṭinadi yīveṣhamu nīgu
vĕnnalam̐ gūḍidi śhrīveṁkaḍeśha sāladā