Eloyi vibhumdaa yippudu baam taidimaa

ఏలోయి విభుఁడా యిప్పుడు బాఁ తైతిమా
Language

(॥పల్లవి॥)
ఏలోయి విభుఁడా యిప్పుడు బాఁ తైతిమా
తాలిమి నిన్నాళ్లు నీ తలఁపిట్టె వుండెనా

(॥ఏ లోయి॥)
సంగతిగా నాపెతోడ జగడించి రా కుండితే
నంగవించి మాతో మాట లాడుదువా
కుంగక కూడు వేఁ డైతే కూరాకు నంజినట్టు
పొంగుచు నీ నా సంది పొందు లెల్ల నిదివొ

(॥ఏలోయి॥)
సన్నల నాపెతో యకసక్యేలకు నేమో కాక
యెన్నఁడైనా మాయింటికి నిట్టే వత్తువా
పన్నీరు గడుఁ జలైతే పచ్చిచాఁదు పూసినట్టు
యెన్నఁగ నీ నా పొందు లిన్నియు నిట్టెపో

(॥ఏలోయి॥)
బలిమి నీ వాపెతోడ పంత మాడి రా కుండితే
కొలఁది మీర నన్నిట్టే కూడుదువా
అలరి శ్రీవెంకటేశ ఆయములు సోఁకినట్టు
తలఁగని నీ నా పొందు తారుకాణ సుమ్మీ

(||pallavi||)
eloyi vibhum̐ḍā yippuḍu bām̐ taidimā
tālimi ninnāḽlu nī talam̐piṭṭĕ vuṁḍĕnā

(||e loyi||)
saṁgadigā nābĕdoḍa jagaḍiṁchi rā kuṁḍide
naṁgaviṁchi mādo māḍa lāḍuduvā
kuṁgaga kūḍu vem̐ ḍaide kūrāgu naṁjinaṭṭu
pŏṁgusu nī nā saṁdi pŏṁdu lĕlla nidivŏ

(||eloyi||)
sannala nābĕdo yagasakyelagu nemo kāga
yĕnnam̐ḍainā māyiṁṭigi niṭṭe vattuvā
pannīru gaḍum̐ jalaide pachchisām̐du pūsinaṭṭu
yĕnnam̐ga nī nā pŏṁdu linniyu niṭṭĕbo

(||eloyi||)
balimi nī vābĕdoḍa paṁta māḍi rā kuṁḍide
kŏlam̐di mīra nanniṭṭe kūḍuduvā
alari śhrīvĕṁkaḍeśha āyamulu som̐kinaṭṭu
talam̐gani nī nā pŏṁdu tārugāṇa summī