ఏలోయి సటకాఁడ యెఱఁగనా నీ సుద్దులు
(॥పల్లవి॥)
ఏలోయి సటకాఁడ యెఱఁగనా నీ సుద్దులు
పోలించి యాపె వలపు పూసేవు నా మీఁదను
(॥॥)
పువ్వుల చెండున వేసెఁ బొరుగున నుండి చెలి
ఇవ్వల నాదిక్కు చూచే వేమీ నీవు
నవ్వేవు నీకితవైతే నాచేతి కిటు చూపు
నివ్వటిల్ల నిజాలకు నే వేసేఁగాని
(॥॥)
కుంకుమ నీపైఁ జల్లె కొలువునున్నకాంత
అంకెల నాచేయి దట్టే వప్పటి నీవు
జంకించే వంతగలితే నింకా నదే నాకు నిమ్మా
కొంకుగొసరెల్లాఁ దేర కోరి చల్లే నిపుడు
(॥॥)
మెచ్చి నిమ్మపంటఁ జిమ్మె మేడమీఁదనున్నసతి
కొచ్చి యడిగి కాఁగిటఁ గూడేవు నన్ను
పచ్చిగా శ్రీవేంకటేశ బత్తి నాపైఁ గలిగితే
మచ్చిక నదె ఇచ్చితే మరివేసే నిన్నును
(||pallavi||)
eloyi saḍagām̐ḍa yĕṟam̐ganā nī suddulu
poliṁchi yābĕ valabu pūsevu nā mīm̐danu
(||||)
puvvula sĕṁḍuna vesĕm̐ bŏruguna nuṁḍi sĕli
ivvala nādikku sūse vemī nīvu
navvevu nīgidavaide nāsedi kiḍu sūbu
nivvaḍilla nijālagu ne vesem̐gāni
(||||)
kuṁkuma nībaim̐ jallĕ kŏluvununnagāṁta
aṁkĕla nāseyi daṭṭe vappaḍi nīvu
jaṁkiṁche vaṁtagalide niṁkā nade nāgu nimmā
kŏṁkugŏsarĕllām̐ dera kori salle nibuḍu
(||||)
mĕchchi nimmabaṁṭam̐ jimmĕ meḍamīm̐danunnasadi
kŏchchi yaḍigi kām̐giḍam̐ gūḍevu nannu
pachchigā śhrīveṁkaḍeśha batti nābaim̐ galigide
machchiga nadĕ ichchide marivese ninnunu