Eloyi mammu neevu yemtamgaa joosevu nemdu

ఏలోయి మమ్ము నీవు యెంతఁగా జూచేవు నేఁడు
Language

(॥పల్లవి॥)
ఏలోయి మమ్ము నీవు యెంతఁగా జూచేవు నేఁడు
యీ లాగు భ్రమసేయెడల మానేము

(॥ఏలో॥)
మనసువచ్చినసతి మాట నీతో నాడఁగాను
పనిలేనిపని నీతోఁ బలికేమా
కనుసన్నలనే మాతోఁ గాఁపురాలు సేసేవు
కొనచీఁటి మోహపుఁగూళలమా నేము

(॥ఏలో॥)
బత్తిగలయాపె నీతోఁ బైకొని పెనఁగఁగా
హత్తినీతో సరసము లాడేమా
పొత్తులమన్నన లిట్టె పొరలించేవు మామీఁద
మొత్తమిగా నిన్ను నంట మూఢులమా

(॥ఏలో॥)
ఆరీతి నాపె నిన్ను నట్టె కాఁగిలించఁగాను
మేరలు మీరి నీతోమేకు చూపేమా
యీరితి శ్రీవేంకటేశ యింతలో నన్నుఁ గూడితి
మోరతోపు లిఁకఁజేయ ములుచలమా

(||pallavi||)
eloyi mammu nīvu yĕṁtam̐gā jūsevu nem̐ḍu
yī lāgu bhramaseyĕḍala mānemu

(||elo||)
manasuvachchinasadi māḍa nīdo nāḍam̐gānu
panilenibani nīdom̐ baligemā
kanusannalane mādom̐ gām̐purālu sesevu
kŏnasīm̐ṭi mohabum̐gūḽalamā nemu

(||elo||)
battigalayābĕ nīdom̐ baigŏni pĕnam̐gam̐gā
hattinīdo sarasamu lāḍemā
pŏttulamannana liṭṭĕ pŏraliṁchevu māmīm̐da
mŏttamigā ninnu naṁṭa mūḍhulamā

(||elo||)
ārīdi nābĕ ninnu naṭṭĕ kām̐giliṁcham̐gānu
meralu mīri nīdomegu sūbemā
yīridi śhrīveṁkaḍeśha yiṁtalo nannum̐ gūḍidi
moradobu lim̐kam̐jeya mulusalamā