Eloyi maadodi yegasakyaalu

ఏలోయి మాతోడి యెగసక్యాలు
Language

(॥పల్లవి॥)
ఏలోయి మాతోడి యెగసక్యాలు
జాలిఁ బడి వున్నవారి సట సేసేవా

(॥ఏ లోయి॥)
సెలవుల నవ్వు నవ్వి చేతి పువ్వుబంతి వేసి
యెలమి మాకోపము నేఁ డేల రేఁచేవు
వులి వచ్చి విరహన నుడుకుతా నుండేవారి
వలపుల యెండలనే వడ చల్లేవా

(॥ఏలోయి॥)
దగ్గరనే నిలుచుండి తతిగొని చన్ను లంటి
యెగ్గులతిట్ల మాచే నేల పడేవు
నొగ్గిన సిగ్గులతోడ నుట్టి లేక వూఁగేవారి
అగ్గలపుటాసలవుయ్యల లూఁచేవా

(॥ఏ లోయి॥)
చేరి పచ్చడము గప్పి చెక్కు నొక్కి కాఁగిలించి
యీరీతి మన్నించి మమ్ము నేల మెచ్చేవు
కూరిమి శ్రీవెంకటేశ కూడిన మావంటివారి
నేరా తరితీపుల నెలయించేవా

(||pallavi||)
eloyi mādoḍi yĕgasakyālu
jālim̐ baḍi vunnavāri saḍa sesevā

(||e loyi||)
sĕlavula navvu navvi sedi puvvubaṁti vesi
yĕlami māgobamu nem̐ ḍela rem̐sevu
vuli vachchi virahana nuḍugudā nuṁḍevāri
valabula yĕṁḍalane vaḍa sallevā

(||eloyi||)
daggarane nilusuṁḍi tadigŏni sannu laṁṭi
yĕgguladiṭla māse nela paḍevu
nŏggina sigguladoḍa nuṭṭi lega vūm̐gevāri
aggalabuḍāsalavuyyala lūm̐sevā

(||e loyi||)
seri pachchaḍamu gappi sĕkku nŏkki kām̐giliṁchi
yīrīdi manniṁchi mammu nela mĕchchevu
kūrimi śhrīvĕṁkaḍeśha kūḍina māvaṁṭivāri
nerā taridībula nĕlayiṁchevā