ఏలో తెలియదు యేలినవాఁడవు నీవే
(॥పల్లవి॥)
ఏలో తెలియదు యేలినవాఁడవు నీవే
మేలుమేలు జాణవౌదు మేర నడపినను
(॥ఏలో॥)
ఆలించఁదడవా అప్పుడే నావిన్నపము
వాలియించి నీవు వలెనంటేను
పాలించఁ దడవా పై కొని నన్నిప్పుడిట్టె
తాలిమితో నామతిఁ దలచిఁతేను
(॥ఏతో॥)
యియ్యకొనఁ దడవా యిప్పుడే నాకూరిములు
యియ్యెడ నింతట నీకు నితవై తేను
నెయ్యమాడఁ దడవా నీవు నేను నవ్వుతాను
చయ్యన నీకే నేఁడు సమ్మతైతేను
(॥ఏలో॥)
కాఁగిలించఁ దడవా కందువరతులలోన
వీఁగక యిట్లా నీకు వేడుకైతేను
దాఁగక శ్రీవేంకటెశ తగఁ గూడితివి నన్ను
ఆఁగి నవ్వఁ దడవా అబ్బురమైతేను
(||pallavi||)
elo tĕliyadu yelinavām̐ḍavu nīve
melumelu jāṇavaudu mera naḍabinanu
(||elo||)
āliṁcham̐daḍavā appuḍe nāvinnabamu
vāliyiṁchi nīvu valĕnaṁṭenu
pāliṁcham̐ daḍavā pai kŏni nannippuḍiṭṭĕ
tālimido nāmadim̐ dalasim̐tenu
(||edo||)
yiyyagŏnam̐ daḍavā yippuḍe nāgūrimulu
yiyyĕḍa niṁtaḍa nīgu nidavai tenu
nĕyyamāḍam̐ daḍavā nīvu nenu navvudānu
sayyana nīge nem̐ḍu sammadaidenu
(||elo||)
kām̐giliṁcham̐ daḍavā kaṁduvaradulalona
vīm̐gaga yiṭlā nīgu veḍugaidenu
dām̐gaga śhrīveṁkaḍĕśha tagam̐ gūḍidivi nannu
ām̐gi navvam̐ daḍavā abburamaidenu