ఎల్లవారి ముందరను యేల కాకుసేయ నీకు
(॥పల్లవి॥)
ఎల్లవారి ముందరను యేల కాకుసేయ నీకు
కొల్లున నవ్వితే నౌ గొల్లవారి పెండ్లి
(॥ఎల్ల॥)
ఆసుద్దులు చెప్పనేల అంగనకు నీవు మెడఁ
బూసలు గట్టినప్పుడే పొందెరిఁగెను
రాసి కన్నెపడుచును రవ్వసేయనేల నీవు
శేస వెట్టినప్పుడే సిగ్గు వుట్టెను
(॥ఎల్ల॥)
యీడకు నాడకు మరి యెడతాఁకించఁగనేల
వీడెమందుకొన్నప్పుడె విందులబ్బెను
వాడికగా నొండొరులు వావెడుగనేల చల్లఁ
చాడె దించుకొన్నప్పుడే సతమాయను
(॥ఎల్ల॥)
ఆదిగొని నీవు నేఁడు ఆస రేఁచనేల ముంచి
పాదము దొక్కినప్పుడే భాగ్యమాయను
యీదె శ్రీ వేంకటేశ యేలితివి యింతి నిట్టే
పోదులు మరిఁ జేయఁగ పొంకమాయను
(||pallavi||)
ĕllavāri muṁdaranu yela kāguseya nīgu
kŏlluna navvide nau gŏllavāri pĕṁḍli
(||ĕlla||)
āsuddulu sĕppanela aṁganagu nīvu mĕḍam̐
būsalu gaṭṭinappuḍe pŏṁdĕrim̐gĕnu
rāsi kannĕbaḍusunu ravvaseyanela nīvu
śhesa vĕṭṭinappuḍe siggu vuṭṭĕnu
(||ĕlla||)
yīḍagu nāḍagu mari yĕḍadām̐kiṁcham̐ganela
vīḍĕmaṁdugŏnnappuḍĕ viṁdulabbĕnu
vāḍigagā nŏṁḍŏrulu vāvĕḍuganela sallam̐
sāḍĕ diṁchugŏnnappuḍe sadamāyanu
(||ĕlla||)
ādigŏni nīvu nem̐ḍu āsa rem̐sanela muṁchi
pādamu dŏkkinappuḍe bhāgyamāyanu
yīdĕ śhrī veṁkaḍeśha yelidivi yiṁti niṭṭe
podulu marim̐ jeyam̐ga pŏṁkamāyanu