Ella venagave saallu yeṟamgavade

ఏళ్ల వెనకవే చాళ్లు యెఱఁగవటే
Language

(॥పల్లవి॥)
ఏళ్ల వెనకవే చాళ్లు యెఱఁగవటే
ఆళ్లేమి గంటే కొఱ్ఱలాయనేమి

(॥ఏళ్ల॥)
సుదతినాతో నలిగి చూడదువో చెలియ
యెదుట నీవు చూడవే యిదే అది
వెదకఁ జందురుఁడేమి వెన్నెలేమి నాకును
మదిలోనితాపము మానితేఁ జాలును

(॥ఏళ్ల॥)
మగువ తాఁ గోపించి మాటాడ దదె నాతో
తగ నీవు వలుకవె తానే తాను
చిగురేమి చేఁగేమి చేరినమానికిని
నిగిడి నాకుఁ జల్లనినీడైతేఁ జాలును

(॥ఏళ్ల॥)
చెలి నాకాఁగిట నుండి సిగ్గువడీ నింకాను
కలిసి నీవై నాఁ గొంతకాఁక రేఁచవే
వెలియేమి లోనేమి వేడుక కొక్కటేకాదా
అలరిన శ్రీవేంకటాధిపుఁడ నేను

(||pallavi||)
eḽla vĕnagave sāḽlu yĕṟam̐gavaḍe
āḽlemi gaṁṭe kŏṭralāyanemi

(||eḽla||)
sudadinādo naligi sūḍaduvo sĕliya
yĕduḍa nīvu sūḍave yide adi
vĕdagam̐ jaṁdurum̐ḍemi vĕnnĕlemi nāgunu
madilonidābamu mānidem̐ jālunu

(||eḽla||)
maguva tām̐ gobiṁchi māḍāḍa dadĕ nādo
taga nīvu valugavĕ tāne tānu
siguremi sem̐gemi serinamānigini
nigiḍi nāgum̐ jallaninīḍaidem̐ jālunu

(||eḽla||)
sĕli nāgām̐giḍa nuṁḍi sigguvaḍī niṁkānu
kalisi nīvai nām̐ gŏṁtagām̐ka rem̐save
vĕliyemi lonemi veḍuga kŏkkaḍegādā
alarina śhrīveṁkaḍādhibum̐ḍa nenu