ఏలినవారికిఁ బోదు యీడేరించఁ దమసొమ్ము
(॥పల్లవి॥)
ఏలినవారికిఁ బోదు యీడేరించఁ దమసొమ్ము
కాలకాసు సేయకున్న ఘనముగాఁ జేతురు
(॥ఏలిన॥)
పసు లే మెఱుఁగఁగా పట్టి కట్టి మేపు మేసి
దెసలఁ బనులు సేయ దిద్దుకొందురు
వసుధ నన్నటు వంటి వానిఁ దెచ్చి మీ సేవకు
నెసఁగ మెదిపి కావు యేమి నే నెఱుఁగ
(॥ఏలిన॥)
బిడ్డ లేమి యియ్యఁగాను ప్రేమముతోఁ గన్నతల్లి
వెడ్డువెట్టి చన్నిచ్చి వెసఁ బెంచును
యెడ్డనైనా నే నీకు యెందునుఁ గొరక్రాకున్న
వొడ్డిన జ్ఞాన మొసఁగి వూరడించి కావవే
(॥ఏలిన॥)
బానిలే దొడ్డు గాన పరులు దడవితేను
దానికై వహించుకొని తాము వత్తురు
నేను నీ దాసుఁడ నింతే నెమ్మది శ్రీ వేంకటేశ
పూనుకొని వచ్చి నన్నెపడు గావవే
(||pallavi||)
elinavārigim̐ bodu yīḍeriṁcham̐ damasŏmmu
kālagāsu seyagunna ghanamugām̐ jeduru
(||elina||)
pasu le mĕṟum̐gam̐gā paṭṭi kaṭṭi mebu mesi
dĕsalam̐ banulu seya diddugŏṁduru
vasudha nannaḍu vaṁṭi vānim̐ dĕchchi mī sevagu
nĕsam̐ga mĕdibi kāvu yemi ne nĕṟum̐ga
(||elina||)
biḍḍa lemi yiyyam̐gānu premamudom̐ gannadalli
vĕḍḍuvĕṭṭi sannichchi vĕsam̐ bĕṁchunu
yĕḍḍanainā ne nīgu yĕṁdunum̐ gŏrakrāgunna
vŏḍḍina jñāna mŏsam̐gi vūraḍiṁchi kāvave
(||elina||)
bānile dŏḍḍu gāna parulu daḍavidenu
dānigai vahiṁchugŏni tāmu vatturu
nenu nī dāsum̐ḍa niṁte nĕmmadi śhrī veṁkaḍeśha
pūnugŏni vachchi nannĕbaḍu gāvave