ఏలినవారికి సెల వేమి సేసినా
(॥పల్లవి॥)
ఏలినవారికి సెల వేమి సేసినా
నాలి నా చేఁతలెల్లాను నవ్వు సేసుకొమ్మీ
(॥ఏలి॥)
తాలిమిలేనిదాన తమకించి నిన్ను నిట్టె
వేళతోనే రావనుచు వెంగెమాడితి
నీలాగు లెఱఁగక నేరములెల్లా నెన్నితి
వోలవేయ కిఁకవన్నీ నోరుచుకొమ్మీ
(॥ఏలి॥)
చపలచిత్తపుదాన సడిఁబడ్డకోపాన
కపటములెల్లాఁ జూచి కల్లలాడితి
వుపమలనే వంచక వొరసితి జరసితి
నెపములెంచక యిఁక నెయ్యమే నిలుపుమీ
(॥ఏలి॥)
చనవు తోడిదాన సారెసారె నిట్టె
కనుఁగొని కనుఁగొని కలదాడితి
యెనసితి శ్రీ వేంకటేశ నే నింతటిలోనె
తనిసితనిసి నాతో దయివారుమీ
(||pallavi||)
elinavārigi sĕla vemi sesinā
nāli nā sem̐talĕllānu navvu sesugŏmmī
(||eli||)
tālimilenidāna tamagiṁchi ninnu niṭṭĕ
veḽadone rāvanusu vĕṁgĕmāḍidi
nīlāgu lĕṟam̐gaga neramulĕllā nĕnnidi
volaveya kim̐kavannī norusugŏmmī
(||eli||)
sabalasittabudāna saḍim̐baḍḍagobāna
kabaḍamulĕllām̐ jūsi kallalāḍidi
vubamalane vaṁchaga vŏrasidi jarasidi
nĕbamulĕṁchaga yim̐ka nĕyyame nilubumī
(||eli||)
sanavu toḍidāna sārĕsārĕ niṭṭĕ
kanum̐gŏni kanum̐gŏni kaladāḍidi
yĕnasidi śhrī veṁkaḍeśha ne niṁtaḍilonĕ
tanisidanisi nādo dayivārumī