Elinavaamdavu neeve yemayyaa

ఏలినవాఁడవు నీవె యేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఏలినవాఁడవు నీవె యేమయ్యా
మేలు నాకు నీవల్ల మీఁద మిక్కిలయ్యా

(॥ఏలిన॥)
అందగారి మాట లెల్ల నాడి నన్ను నమ్మించి
కందువకుఁ దీసితివి గదవయ్యా
చెందమ్మిరేకులవంటి చేరఁడేసి నా కన్నుల
కిందు కెల్ల గురి యైతి విఁక నీ చిత్త మయ్యా

(॥ఏలిన॥)
యింట నూరకుండేదాన నెలయించి నవ్వించి
గంటి సేసితివి మోవి గదవయ్యా
గొంటరి నా చనుఁబువ్వు గుత్తుల పూజలకును
నంటున లో నయితిని నాఁడె కదవయ్యా

(॥ఏలిన॥)
కోరి నీవు కాఁగిటిలో గూడినచనవు లెల్ల
గారవానఁ చెల్లించితి గదవయ్యా
యీరీతి శ్రీవెంకటేశ యెనసి నా చిత్తమనే
వూరిలో నెలకొంటివి వొడఁబాటే అయ్యా

(||pallavi||)
elinavām̐ḍavu nīvĕ yemayyā
melu nāgu nīvalla mīm̐da mikkilayyā

(||elina||)
aṁdagāri māḍa lĕlla nāḍi nannu nammiṁchi
kaṁduvagum̐ dīsidivi gadavayyā
sĕṁdammiregulavaṁṭi seram̐ḍesi nā kannula
kiṁdu kĕlla guri yaidi vim̐ka nī sitta mayyā

(||elina||)
yiṁṭa nūraguṁḍedāna nĕlayiṁchi navviṁchi
gaṁṭi sesidivi movi gadavayyā
gŏṁṭari nā sanum̐buvvu guttula pūjalagunu
naṁṭuna lo nayidini nām̐ḍĕ kadavayyā

(||elina||)
kori nīvu kām̐giḍilo gūḍinasanavu lĕlla
gāravānam̐ sĕlliṁchidi gadavayyā
yīrīdi śhrīvĕṁkaḍeśha yĕnasi nā sittamane
vūrilo nĕlagŏṁṭivi vŏḍam̐bāḍe ayyā